World’s first solar bicycle: సోలార్ సైకిళ్లు వచ్చేస్తున్నాయ్‌.. ప్రపంచంలోనే తొలిసారి.

Updated on: Feb 17, 2024 | 5:56 PM

ప్రపంచంలోనే తొలిసారిగా భారత్ సోలార్ సైకిళ్లు రెడీ అవుతున్నాయి. బరోడా ఎలక్ట్రిక్‌ మీటర్స్‌ లిమిటెడ్‌ కంపెనీ వీటిని తయారు చేస్తోంది. ఈ సైకిళ్లను ఎలక్ట్రిక్‌ వాహనంలా కూడా ఉపయోగించవచ్చు. గతంలో ఈ కంపెనీ గుజరాత్‌లోని ఇళ్లకు అమర్చిన ఎనర్జీ మీటర్లను తయారుచేసింది. తాజాగా వల్లభ్ విద్యానగర్ లోని బిర్లా విశ్వకర్మ మహావిద్యాలయంలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించారు.

ప్రపంచంలోనే తొలిసారిగా భారత్ సోలార్ సైకిళ్లు రెడీ అవుతున్నాయి. బరోడా ఎలక్ట్రిక్‌ మీటర్స్‌ లిమిటెడ్‌ కంపెనీ వీటిని తయారు చేస్తోంది. ఈ సైకిళ్లను ఎలక్ట్రిక్‌ వాహనంలా కూడా ఉపయోగించవచ్చు. గతంలో ఈ కంపెనీ గుజరాత్‌లోని ఇళ్లకు అమర్చిన ఎనర్జీ మీటర్లను తయారుచేసింది. తాజాగా వల్లభ్ విద్యానగర్ లోని బిర్లా విశ్వకర్మ మహావిద్యాలయంలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించారు. ఆ విద్యార్థుల సాయంతో వరల్డ్ వైడ్ ఫస్ట్ సోలార్ సైకిల్ రోలౌట్, డిస్ట్రప్టివ్ ఇన్నోవేషన్ ఇన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పేరుతో ఓ స్టార్టప్ కంపెనీగా సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ప్రభుత్వాధికారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ సోలార్ సైకిల్ ప్రాజెక్ట్‌పై ప్రశంసలు కురిపించారు. మెహతా, హితార్ధ్ సోలంకి, ముస్తఫా మున్షీ, రుషీ షా అనే నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు సోలార్ సైకిల్ నమూనాను సిద్ధం చేశారు.

ఈ సోలార్ సైకిల్ తయారు చేయడానికి రెండేళ్ల కాలం పట్టినట్టు వారు తెలిపారు. ఈ సోలార్ సైకిల్‌కు మైక్రో కంట్రోలర్ ఆధారిత బ్యాటరీ ఛార్జ్ కంట్రోలర్‌తో పాటు 40 వాట్స్ సోలార్‌ ప్యానెల్‌ను అమర్చారు. ఈ సైకిల్‌‌లో 180 వోల్ట్స్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసేందుకు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఈ సైకిల్ 12 వోల్ట్స్, 40 వోల్ట్స్ తక్కువ వోల్టేజీలతో పనిచేస్తుంది. భారతదేశంలో తొలిసారి తయారు చేస్తున్న సోలార్ సైకిల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వ్యాపారపరంగా కూడా అధిక శాతం ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Loading...
Unable to load recommendations.
Follow Us