Realme Narzo 50A Prime: సరికొత్త రియల్‌మీ నార్జో 50A ప్రైమ్ ఫీచర్లు ఇవే
50mp triple rear cameras, Realme Narzo 50A Prime, realme narzo launched, realme, realme new mobile నేడు రియల్‌మి కంపెనీ కొత్తగా నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ని భారతదేశంలో ప్రారంభించింది.
50mp triple rear cameras, Realme Narzo 50A Prime, realme narzo launched, realme, realme new mobile
నేడు రియల్‌మి కంపెనీ కొత్తగా నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ని భారతదేశంలో ప్రారంభించింది. ఈ సరికొత్త ఫోన్ ఆక్టా-కోర్ యునిసోక్ T612 ప్రాసెసర్‌తో, 4GB RAM, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. అలాగే ఈ హ్యాండ్‌సెట్ 6.6-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భారతదేశంలో రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో విడుదల అయింది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.11,499 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లాష్ బ్లాక్, ఫ్లాష్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది అమెజాన్ కంపెనీ ఆన్‌లైన్ స్టోర్, రిటైల్ స్టోర్‌ల ద్వారా ఏప్రిల్ 28 నుంచి కొనుగోలుకి సిద్దంగా ఉన్నాయి.
Also Watch:
బాక్సాఫీస్ బాస్ చిరుకి ఘోర పరాభవం రెండో రోజు నో కలెక్షన్స్
చిరును అరాచకంగా ఆడుకుంటున్నారు !! రెచ్చిపోతున్న మోహన్ బాబు సపోర్టర్స్
చిరంజీవి VS బాలయ్య !! ఇండస్ట్రీలో మొదలైన లొల్లి
మేకర్స్ కు చిరు స్వీట్ వార్నింగ్ !! నెక్ట్స్ సినిమాలపై నజర్