Organ Donation: మరణం తర్వాత అవయవదానం

Updated on: Nov 12, 2025 | 5:33 PM

సాధారణంగా బ్రెయిన్‌డెడ్ వారికే అనుమతించే అవయవదానంలో, ఢిల్లీ వైద్యులు నార్మోథెర్మిక్‌ రీజనల్‌ పర్ఫ్యూజన్‌ ప్రక్రియతో సహజ మరణం తర్వాత అవయవాలు (కాలేయం, మూత్రపిండాలు) సేకరించి చరిత్ర సృష్టించారు. దేశంలోనే తొలిసారిగా జరిగిన ఈ విజయంతో అవయవ కొరతను అధిగమించి, ఎంతోమందికి కొత్త ఆశలు చిగురించాయి. గీతాచావ్లా కుటుంబం నిర్ణయం, వైద్యుల నైపుణ్యం దేశానికి ఆదర్శం.

సాధారణంగా మన దేశంలో బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. అంటే, మెదడు పనిచేయడం ఆగిపోయినా గుండె కొట్టుకుంటున్న వారి నుంచే అవయవదానానికి చట్టపరమైన అనుమతి ఉంది. కానీ, ఢిల్లీ వైద్యులు ‘నార్మోథెర్మిక్‌ రీజనల్‌ పర్ఫ్యూజన్‌’ అనే ప్రత్యేక ప్రక్రియ ద్వారా సహజ మరణం తర్వాత కూడా అవయవాలను సేకరించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సహజంగా మరణించిన వ్యక్తి నుంచి దేశంలోనే మొదటిసారిగా, ఢిల్లీలోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు అవయవాలను సేకరించారు. దీంతో అవయవదానంపై ఉన్న పరిమితులు తొలగిపోయి, కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో భారత వైద్య రంగంలో ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైందనే చెప్పాలి. మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడుతున్న 55 ఏళ్ల గీతాచావ్లా ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆమె ముందుగానే తన అవయవాలను దానం చేసేందుకు సంసిద్ధత తెలిపారు. నవంబర్ 6వ తేదీ రాత్రి 8.43 గంటలకు ఆమె గుండె ఆగిపోవడంతో సహజంగా మరణించారు. చట్టపరమైన నిబంధనల దృష్ట్యా, ఆమె మరణించిన ఐదు నిమిషాల తర్వాత వైద్యులు ఈ ప్రత్యేక ప్రక్రియను ప్రారంభించారు. ఈ విధానంలో పంప్ ద్వారా ఆమె పొత్తికడుపు భాగానికి రక్త ప్రసరణను కృత్రిమంగా పునరుద్ధరించారు. దీనివల్ల కాలేయం, మూత్రపిండాలు పాడవకుండా సజీవంగా ఉన్నాయి. అనంతరం వాటిని విజయవంతంగా సేకరించి, అవసరమైన వారికి అమర్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రక్రియ గత రెండు దశాబ్దాలుగా వాడుకలో ఉన్నప్పటికీ, మన దేశంలో దీనిని చేపట్టడం ఇదే తొలిసారి. ఈ విజయంతో దేశంలో అవయవాల కొరతను అధిగమించేందుకు ఒక కొత్త మార్గం తెరుచుకున్నట్లయింది. గీతాచావ్లా కుటుంబం తీసుకున్న గొప్ప నిర్ణయం, వైద్యుల నైపుణ్యం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్రైడ్ రైస్‌లో బొద్దింకషాకైన కస్టమర్లు

తాగకపోతే దాహం, తాగితే రోగం 143 కృష్ణా గ్రామాల వారి ఆవేదన

సంక్రాంతికి రైల్వే టికెట్ బుకింగ్ కు ఇదే రైట్ టైమ్‌

సెంట్రల్‌ జైల్లో ఖైదీల రాజభోగాలు..!

RGV: చిరంజీవికి రామ్‌గోపాల్‌ వర్మ సారీ..!