NASA: 2040 నాటికి చంద్రుడిపై 3డీ ఇళ్ల నిర్మాణం
2040 నాటికి చంద్రుడిపై మనుషుల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది.. భారత్ సహా పలు దేశాలు చంద్రుడి గుట్టు విప్పేందుకు ఎంతో కాలంగా పరిశోధనలు సాగిస్తున్నాయి. చంద్రుడిపై మానవాళి జీవనానికి అనువైన వాతావరణం ఉందా? అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల కోసం వ్యోమగాములు అధిక సమయం అక్కడే ఉండేందుకు ఈ నిర్మాణాలు తోడ్పడతాయని తెలిపింది.
2040 నాటికి చంద్రుడిపై మనుషుల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది.. భారత్ సహా పలు దేశాలు చంద్రుడి గుట్టు విప్పేందుకు ఎంతో కాలంగా పరిశోధనలు సాగిస్తున్నాయి. చంద్రుడిపై మానవాళి జీవనానికి అనువైన వాతావరణం ఉందా? అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల కోసం వ్యోమగాములు అధిక సమయం అక్కడే ఉండేందుకు ఈ నిర్మాణాలు తోడ్పడతాయని తెలిపింది. 3డీ ప్రింటర్ సాయంతో రాక్ చిప్స్, ఖనిజాలను ఉపయోగించి ఇళ్ల నిర్మాణాలు చేస్తారు. ప్రైవేటు కంపెనీలు, యూనివర్సిటీలను భాగస్వాములను చేస్తూ ఆధునిక సాంకేతికత సాయంతో ఇళ్లను నిర్మించాలని భావిస్తున్నట్లు నాసా సాంకేతిక విభాగం డైరెక్టర్ నిక్కీ వెర్కీసర్ తెలిపారు. 2024 ఫిబ్రవరిలో 3డీ ప్రింటర్‌ను చంద్రుడి ఉపరితలంపైకి పంపాలని నిర్ణయించామని ప్రస్తుతం ప్రింటర్ పనితీరును పరీక్షిస్తున్నామని అన్నారు.