హిందూ మహాసముద్రంలో భారీ ‘గ్రావిటీ హోల్’.. వీడిన మిస్టరీ!

Updated on: May 29, 2026 | 3:55 PM

భారతదేశానికి నైరుతి దిశలో హిందూ మహాసముద్రంలో ఉన్న భారీ గ్రావిటీ హోల్ రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. భూమి అంతర్భాగంలో కోట్ల ఏళ్ల క్రితం జరిగిన టెక్టోనిక్ మార్పులు, పురాతన మహాసముద్ర అవశేషాలే దీనికి కారణమని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ ప్రాంతంలో గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటంతో సముద్ర మట్టం ప్రపంచ సగటుతో పోలిస్తే గణనీయంగా దిగువకు ఉంటుంది.

హిందూ మహాసముద్రంలో, ముఖ్యంగా భారతదేశానికి నైరుతి దిశలో ఉన్న ఓ భారీ ‘గ్రావిటీ హోల్’ వెనుక ఉన్న రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఛేదించారు. ఇది భూమిపై ఉండే సాధారణ గొయ్యి కాదు. గురుత్వాకర్షణ శక్తి అత్యంత బలహీనంగా ఉన్న ప్రాంతం. ఈ భౌగోళిక అద్భుతం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు జరిపిన పరిశోధనల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూమి అంతర్భాగంలోని సంక్లిష్ట ప్రక్రియలే దీనికి కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గతంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కి చెందిన దేబంజన్ పాల్, ఆత్రేయీ ఘోష్ అనే శాస్త్రవేత్తలు ఈ గ్రావిటీ హోల్‌ గురించి ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భూమి పొరల్లో సుమారు 1,000 కిలోమీటర్ల కింద తీవ్రమైన చలి, సాంద్రతతో కూడిన ప్రాంతం ఉందని, అది 3 మూడు కోట్ల ఏళ్ల నాడు ఆఫ్రికా కింద ఉన్న స్లాబ్ గ్రేవ్‌యార్డ్‌లో కలిసిసోయిన పురాతన మహాసముద్రపు అవశేషమని వారు ప్రతిపాదించారు. దాదాపు 30 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ ప్రాంతంలో గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీని ప్రభావం వల్ల ఇక్కడ సముద్ర మట్టం ప్రపంచ సగటు కంటే సుమారు 106 మీటర్ల వరకు లోతుగా ఉంటుంది. 1940లలోనే నౌకల ద్వారా ఈ గ్రావిటీ హోల్‌ను తొలిసారి కనుగొన్నారు. ఆ తర్వాత ఉపగ్రహాలు దీని ఉనికిని నిర్ధారించాయి. ఈ వింత భౌగోళిక మార్పు వల్ల మానవాళికి గానీ, నౌకాయానానికి గానీ ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు స్పష్టం చేశారు. అయితే భూమి అంతర్భాగ నిర్మాణం, టెక్టోనిక్ ప్లేట్ల కదలికలను అధ్యయనం చేయడానికి, అలాగే శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థల కచ్చితత్వాన్ని మరింత మెరుగుపరచడానికి ఈ సరికొత్త పరిశోధనలు ఎంతో దోహదపడతాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిండి పెట్టకుండా కొట్టి.. లైంగికంగా వేధించి..

భిక్షాటన చేస్తూ.. లక్షల విరాళమిచ్చిన రియల్ హీరో

Follow Us