4 నెలల్లో 6G వస్తోంది..ప్రధాని మోదీ కీలక ప్రకటన

Updated on: Sep 01, 2025 | 5:59 PM

భారత్‌లోకి 6G సేవలు రాబోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ అంశంపై ఆయన కీలక ప్రకటన చేశారు. 2025 చివరి నాటికి దేశీయంగా తయారు చేసిన మొదటి సెమీకండక్టర్ చిప్‌ను విడుదల చేయనుందని, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా 6G నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో దేశం వేగంగా ముందుకు వెళ్తోందని ఆయన వెల్లడించారు.

గత ఐదు నుండి ఆరు దశాబ్దాలుగా భారతదేశం సెమీకండక్టర్ రంగంలో అనేక అవకాశాలను కోల్పోయిందని మోదీ అన్నారు. “ 50-60 సంవత్సరాల క్రితమే భారతదేశంలో సెమీకండక్టర్ తయారీ ప్రారంభం కావాల్సింది. కానీ, మనం ఆ అవకాశాన్ని కోల్పోయాం. అయితే, ఈ పరిస్థితిని మార్చే ప్రయత్నం చేయటంతో… నేడు మనదేశానికి సెమీకండక్టర్ పరిశ్రమలు రావడం ప్రారంభించాయి. ఈ ఏడాది చివరికి మొదటి మేడ్-ఇన్-ఇండియా చిప్ మార్కెట్లోకి రానుంది” అని ప్రధాని పేర్కొన్నారు. దేశ సాంకేతిక రంగ వేగాన్ని ప్రస్తావిస్తూ.. మేడ్ ఇన్ ఇండియా 6Gపై వేగంగా పని చేస్తున్నాం అని ప్రధాని వెల్లడించారు. ఇండియా 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయాలనే ప్రణాళికతో ముందుకు పోతోందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. “భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోని 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయబోతోంది. దీనికి సంబంధించిన చాలా పెద్ద కార్యక్రమం కూడా ఆగస్టు 26న ప్రారంభం కానుంది.” అని ఆయన పేర్కొన్నారు. “సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రాన్ని అనుసరించే భారతదేశం నేడు ప్రపంచం వృద్ధి రేటులో కీలకం కానుంది” అని మోదీ అన్నారు. భారతదేశం త్వరలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ప్రపంచ వృద్ధికి 20 శాతం దోహదపడుతుందని ఆయన అంచనా వేశారు. షిప్పింగ్, పోర్టులు, క్రీడలకు సంబంధించిన పురాతన చట్టాలను – విస్తృత సంస్కరణలు భర్తీ చేశాయని, పోర్టు ఆధారిత అభివృద్ధిని పెంచడానికి, నీలి ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి, కొత్త జాతీయ క్రీడా విధానం ద్వారా బలమైన క్రీడా పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి రూపొందించిన ఆధునిక చట్రాలతో దీనిని రూపొందించామని ఆయన అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇటీవల జరిగిన శాసనసభ అంతరాయాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. ప్రభుత్వం సంస్కరణలకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. “ప్రతిపక్షాలు సృష్టించిన అనేక అంతరాయాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో సంస్కరణలలో నిమగ్నమై ఉంది” అని ఆయన అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balakrishna: వరద బాధితులకు అండగా.. విరాళం ప్రకటించిన బాలయ్య

‘మిస్‌ అవుతున్నా నాన్నా..’ గౌతమ్‌ బర్త్‌ డే వేళ మహేష్ ఎమోషనల్

నా అత్తమ్మ తన కళ్లను దానం చేసింది.. ఫోటోలతో సహా.. చూపించిన చిరు

Loading...
Unable to load recommendations.
Follow Us