చైనా ‘బిలిబిలి’వైపు భారత కంటెంట్ క్రియేటర్ల చూపు

Updated on: Sep 24, 2026 | 10:12 PM

యూట్యూబ్‌లో మానిటైజేషన్‌ కఠినంగా మారడంతో కొందరు భారతీయ కంటెంట్‌ క్రియేటర్లు ప్రత్యామ్నాయ వేదికలపై దృష్టి పెడుతున్నారు. చైనాకు చెందిన వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ బిలిబిలిలో గేమింగ్‌, ట్రావెల్‌, టెక్నాలజీ కంటెంట్‌ అప్‌లోడ్‌ చేస్తున్నట్లు సమాచారం. భారత్‌లో అధికారిక లభ్యతపై స్పష్టత లేకపోవడంతో కొందరు VPN, APKల ద్వారా యాక్సెస్‌ చేస్తున్నారని కథనం పేర్కొంటోంది. అంతర్జాతీయ ప్రేక్షకులను చేరుకోవడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ ఉపయోగపడుతుందని కొందరు క్రియేటర్లు భావిస్తున్నారు.

యూట్యూబ్‌లో రూల్స్ కఠినతరం కావడం, మానిటైజేషన్ కష్టంగా మారడంతో భారతీయ కంటెంట్ క్రియేటర్లు కొత్త ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగా ‘చైనా యూట్యూబ్’గా పేరొందిన ప్రముఖ వీడియో షేరింగ్ వేదిక ‘బిలిబిలి’ వైపు మన క్రియేటర్లు భారీగా మొగ్గు చూపుతున్నారు. భారత్‌లో ఈ యాప్ ఇంకా అధికారికంగా అందుబాటులోకి రాకపోయినప్పటికీ, క్రియేటర్లు క్రేజీగా అందులో కంటెంట్ అప్‌లోడ్ చేస్తుండటం గమనార్హం. 2009లో ప్రారంభమైన బిలిబిలి మొదట్లో యానిమేషన్, గేమింగ్‌లకే పరిమితమైనా.. ప్రస్తుతం టెక్నాలజీ, లైఫ్‌స్టైల్, ట్రావెల్ వీడియోలతో దూసుకెళ్తోంది. నెలకు ఏకంగా 37.6 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లతో, ప్రతి వినియోగదారు రోజుకు సగటున 112 నిమిషాలు ఈ యాప్‌లోనే గడుపుతున్నారంటే దీనికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం భారత్‌లో ఈ యాప్ అందుబాటులో లేకపోవడంతో క్రియేటర్లు విపిఎన్ (VPN), ఏపికే (APK) ఫైళ్ల ద్వారా దీనిని యాక్సెస్ చేస్తున్నారు. ఝార్ఖండ్‌కు చెందిన నవనీత్ కుమార్ అనే ట్రావెల్ వ్లాగర్ బిలిబిలిలో వీడియోలు పెట్టగా, కేవలం 15 రోజుల్లోనే భారీ వ్యూస్ వచ్చాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు, ముఖ్యంగా గేమింగ్, ట్రావెల్ కంటెంట్‌కు ఇది మంచి వేదిక అని క్రియేటర్లు భావిస్తున్నారు. ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లలో బాగా విస్తరించిన ఈ ప్లాట్‌ఫామ్‌ను గతంలో టిక్‌టాక్ లాగే భారత్ నిషేధిస్తుందా లేక అధికారిక ఎంట్రీకి అనుమతిస్తుందా అనేది వేచి చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెడలో కొండచిలువతో యువతి డ్యాన్స్‌.. హైదరాబాద్‌లో షాకింగ్‌ ఘటన

విలయం సృష్టించిన వాయుగుండం.. వణికిపోయిన ఉత్తరాంధ్ర.. తెలంగాణలో రెండు రోజులు వానలే

కారులో రూ.2 కోట్లు.. జిమ్‌లో ఓనర్ వర్కవుట్లు.. కట్ చేస్తే

Gold Price: బంగారం ధరలకు భారీ షాక్‌.. ఒక్కరోజే రూ.1,520 పతనం

Balapur Laddu: బాలాపూర్ లడ్డూ వేలం.. సరికొత్త రికార్డులు?

Loading...
Unable to load recommendations.
Follow Us