PM Modi – Bill Gates: ఏఐ టు డిజిటల్ పేమెంట్స్.. ప్రధాని మోదీతో బిల్‌గేట్స్.. టెక్నాలజీ పే చర్చ.. లైవ్

|

Mar 29, 2024 | 9:25 AM

ఒకరు టెక్నాలజీ విప్లవాన్ని తీసుకొస్తే, మరొకరు ఆ టెక్నాలజీని సామాన్యుడి దగ్గరకు తీసుకొచ్చిన దార్శనికుడు. వారిద్దరిలో ఒకరు వ్యాపారవేత్త, మరొకరు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సారధి. వారే మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, ప్రధాని మోదీ. వారిద్దరి మధ్య టెక్నాలజీ గురించి సంభాషణ జరిగింది.

ఒకరు టెక్నాలజీ విప్లవాన్ని తీసుకొస్తే, మరొకరు ఆ టెక్నాలజీని సామాన్యుడి దగ్గరకు తీసుకొచ్చిన దార్శనికుడు. వారిద్దరిలో ఒకరు వ్యాపారవేత్త, మరొకరు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సారధి. వారే మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, ప్రధాని మోదీ. వారిద్దరి మధ్య టెక్నాలజీ గురించి సంభాషణ జరిగింది. ప్రపంచానికి సరికొత్తగా పరిచయం అవుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గురించి వీరిద్దరూ ప్రత్యేకంగా చర్చించుకున్నారు. టెక్నాలజీకి అలవాటు పడటంలోనే కాదు, వాడటంలోనూ భారతీయులు ముందు నిలుస్తున్నారని బిల్‌గేట్స్‌ ప్రశంసించారు. టెక్నాలజీ అందరికీ అన్న థీమ్‌ను భారత్‌ చర్చనీయాంశంగా మార్చిందని గేట్స్‌ అభినందించారు.

డిజిటల్‌ పేమెంట్స్‌, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రా, మహిళల సారధ్యంలో సాగే అభివృద్ధి, సృజనాత్మకత వంటి అంశాలపై బిల్‌గేట్స్‌, ప్రధాని మోదీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి డిజిటల్‌ పేమెంట్లదాకా.. అనేక మార్పులపై ఇద్దరు ప్రముఖులు చర్చించారు.

ప్రధాని మోదీతో బిల్ గేట్స్ సంభాషణకు సంబంధించిన వీడియోను వీక్షించండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..