PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య వీడియో

Updated on: May 18, 2025 | 7:54 AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ఆదివారం ఉదయం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో దశ తర్వాత వాహక నౌకలో సాంకేతిక సమస్య వచ్చింది.రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన కొద్దిసేపటికే దానిలో సాంకెతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ఆదివారం ఉదయం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో దశ తర్వాత వాహక నౌకలో సాంకేతిక సమస్య వచ్చింది.రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన కొద్దిసేపటికే దానిలో సాంకెతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్ర నుంచి ఉదయం 5:59 గంటలకు పీఎస్ఎల్‌వీ సీ 61 రాకెట్ ప్రయోగించబడింది. తర్వత ఈఓఎస్ 09 మిషన్ పూర్తికాలేదని ఇస్రో తెలిపింది. దీంతో ఇస్రో చైర్మన్ వి నారాయణ్ మాట్లాడుతూ మిషన్ పూర్తి కాలేదు మూడవ దశ ప్రారంభమైన కొద్దసేపటికి దాని పనితరులో సమస్య వచ్చిందంటూ పేర్కొన్నారు. మేము దీని పూర్తి వివరాలు పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు.

Published on: May 18, 2025 07:30 AM