Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌.. స్పర్శ దర్శనం సమయాలు

Updated on: Dec 24, 2025 | 10:11 AM

శ్రీశైలం భక్తులకు శుభవార్త! 2026 జనవరి నుండి శ్రీభ్రమరాంభిక మల్లికార్జునస్వామి దర్శన వేళలు పొడిగించారు. శని, ఆది, సోమవారాలు, సెలవు దినాల్లో స్పర్శ దర్శనం ఆన్‌లైన్ టిక్కెట్ల సంఖ్య పెంచబడింది. మూడు స్లాట్లలో దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. రూ.150, రూ.300 టిక్కెట్లతో పాటు అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ సౌకర్యం ఉంది. సాధారణ భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం.

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌.. శ్రీభ్రమరాంభిక మల్లికార్జునస్వామివార్ల దర్శన వేళలు పెంచుతూ ఆలయ ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2026 జనవరి నుంచి పెరిగిన దర్శన సమయాలు అందుబాటులోకి వస్తాయి. ఈ క్రమంలో శని, ఆది, సోమవారాలు, సెలవు దినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్పర్శ దర్శనాలకు సంబంధించిన ఆన్‌లైన్‌ టికెట్లను భారీగా పెంచారు. జనవరి 3 నుంచి మూడు స్లాట్ల ద్వారా భక్తులకు స్పర్శ దర్శనం టికెట్లు జారీ చేయనున్నట్టు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శని, ఆది, సోమవారాలలో ఉదయం 6 గంటలనుంచి 7 గంటల వరకూ విఐపీ బ్రేక్‌ దర్శనం, 7 నుంచి 8:30 వరకూ స్పర్శ దర్శనం, 10:30 నుంచి 11:30 వరకూ వీఐపీ బ్రేక్‌ దర్శనం, తిరిగి 11.45 నుంచి 2 గంటల వరకూ వీఐపీ దర్శనం, రాత్రి 7.45 నుంచి 8 గంటల వరకూ తిరిగి రాత్రి 9 నుంచి 11 గంటల వరకూ స్పర్శదర్శనం ఉంటాయని వెల్లడించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారిక వెబ్సైట్www.aptemples.ap.in ఇంకా www.srisailamdevasthanam.org ద్వారా, మన మిత్ర 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. రూ.150 శీఘ్ర దర్శనం, 300 అతి శీఘ్ర దర్శనం టికెట్లను ఆన్లైన్ కరెంటు బుకింగ్ ద్వారా పొందవచ్చని తెలిపారు. సాధారణ భక్తులకు త్వరగా స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క గ్రామ పంచాయతీకి ఇద్దరు సర్పంచులా ?? ఇదెక్కడి ట్విస్ట్

‘కమెడియన్స్‌ది ఏ స్థానమో మళ్లీ చూపించారు’ మీకో దండం

Demon Pavan: డీమాన్ పవన్‌కు జాక్‌ పాట్ విన్నర్‌ ప్రైజీ మనీకి సమానంగా నొక్కాడు

మెడికల్ మాఫియాపై ఇంట్రెస్టింగ్ సీరిస్! ‘ఫార్మా’ సిరీస్ రివ్యూ

Kajal Aggarwal: స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది