Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
వచ్చే నెల మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఉదయం 6:00 నుండి రాత్రి 7:30 వరకు ఆలయ ద్వారాలు మూసి ఉంటాయి. ఈ రోజున ఆర్జిత సేవలు, అన్నప్రసాద వితరణ రద్దు చేయబడ్డాయి. భక్తులు దర్శన వేళలను (ఉదయం 4:30-5:30, రాత్రి 9:00-10:30) గమనించి, ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని దేవస్థానం కోరింది. పరివార ఆలయాలు కూడా మూసి ఉంటాయి.
వచ్చే నెల మార్చి 3వ తేదీన దేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. గ్రహణ కాల నియమాలను పాటిస్తూ ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 3న ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు. కేవలం ఉదయం 4:30 నుండి 5:30 వరకు, తిరిగి రాత్రి 9:00 నుండి 10:30 వరకు మాత్రమే భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనానికి అనుమతి ఉంటుంది. రాత్రి 7:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి, ఆలయ శుద్ధి మరియు సంప్రోక్షణ అనంతరం రాత్రి 9:00 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం కారణంగా ఆ రోజు ఆలయంలో నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలు, కల్యాణోత్సవాలు రద్దు చేశారు ఆలయ అధికారులు. అలాగే, భక్తులకు అందించే అన్నప్రసాద వితరణ కూడా పూర్తిగా నిలుపుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన ఆలయంతో పాటు సాక్షి గణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం వంటి పరివార ఆలయాలు కూడా మూసివేస్తారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి, తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TTD: శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Trisha Krishnan: ‘ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా’త్రిష షాకింగ్ ట్వీట్!
Sree Vishnu: నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు’.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
