My Home Industries: మై హోమ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో శ్రీమద్భాగవత సప్తహా జ్ఞాన మహా యజ్ఞం.. పెద్ద ఎత్తున తరలివస్తున్న జనం..

|

Sep 25, 2023 | 8:42 AM

Mellacheruvu Sri Venkateswraswamy Temple: మై హోమ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో శ్రీమద్భాగవత సప్తహా జ్ఞాన మహా యజ్ఞం రెండోవ రోజు కొనసాగింది. శ్రీమద్భాగవత సప్తహా జ్ఞాన మహా యజ్ఞాన్ని ఆలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. దీంతో మేళ్లచెరువులోని మహా సిమెంట్ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

Mellacheruvu Sri Venkateswraswamy Temple: మై హోమ్ యాజమాన్యం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో మహత్కార్యానికి శ్రీకారం చుట్టింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని మహా సిమెంట్ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీమద్భాగవత సప్తహా జ్ఞాన మహా యజ్ఞం రెండోవరోజు వైభవంగా కొనసాగింది. మైహోమ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ మహా యజ్ఞం వైభవంగా జరిపించారు. త్రిదండి చిన్న జీయర్ స్వామి మంగళ శాసనంతో శ్రీమాన్ నేపాల్ శ్రీ కృష్ణమాచార్య స్వామి ప్రవచనం చేశారు.

ఈ మహా యజ్ఞంలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీమద్భాగవత పారాయణంతోపాటు నిత్య హోమం నిర్వహించారు. వేద వ్యాసుడు రాసిన శ్రీమద్భాగవతం భారతీయులకు నిధి లాంటిదన్నారు శ్రీమాన్ నేపాల్ శ్రీ కృష్ణమాచార్య స్వామి.

మరో ఐదు రోజులపాటు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు శ్రీమద్భాగవత పారాయణం, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించనున్నారు. అనంతరం పూర్ణాహుతి తీర్థ గోష్టి ఉంటుంది.

మై హోమ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీమద్భాగవత సప్తహా జ్ఞాన మహా యజ్ఞాన్ని ఆలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. దీంతో మేళ్లచెరువులోని మహా సిమెంట్ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..