శ్రీరాముడిని గుర్తు చేసిన దక్షిణాఫ్రికా క్రికెటర్.. విల్లు-బాణం ఫోజు పెట్టి సెంచరీ సెలబ్రేషన్

Updated on: Oct 10, 2025 | 5:56 PM

భారత్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ 2025 క్రికెట్ పోటీలలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్ ప్లేయర్ టాజ్మిన్ బ్రిట్స్ తన సెంచరీని చాలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుని ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ప్రస్తుతం దేశంలో దసరా పండుగ ముగిసి, దీపావళి రాబోతున్న నేపథ్యంలో బ్రిట్స్ తన సెంచరీని శ్రీరాముడి విల్లు-బాణం ఫోజు పెట్టి సెలబ్రేట్ చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. టాజ్మిన్ బ్రిట్స్ సెంచరీ పూర్తయిన వెంటనే, మోకాలిపై కూర్చుని తన చేతులతో విల్లు-బాణం సంధించినట్లుగా ఫోజు ఇచ్చింది. ఈ స్పెషల్ సెలబ్రేషన్ చూసిన భారతీయ ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. దేశంలో దసరా పండుగ వాతావరణం ఉన్న సమయంలో బ్రిట్స్ పెట్టిన ఈ ఫోజు.. శ్రీరాముడి అద్భుతమైన లీలలను గుర్తు చేసిందని అంటున్నారు. మైదానంలో బ్రిట్స్ యాక్షన్ చేసిన వీడియోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. టాజ్మిన్ బ్రిట్స్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ పవర్‌ఫుల్ బ్యాటర్ గత ఐదు వన్డే మ్యాచ్‌లలో ఏకంగా నాలుగు సెంచరీలు నమోదు చేసింది. ఈ ఏడాది లో ఆమె బ్యాట్ నుంచి ఇప్పటివరకు ఐదు సెంచరీలు వచ్చాయి. ఈ ప్రదర్శనతో బ్రిట్స్… మహిళల క్రికెట్‌లో ఒక సంవత్సరంలో అత్యధిక సెంచరీలు చేసిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గంభీర్ ఇంట్లో స్పెషల్ డిన్నర్.. స్పెషల్‌ లుక్స్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌

Mass Jathara: మాస్ జాతర పై బాహుబలి ప్రభావం ఎంత

Pooja Hegde: రీ ఎంట్రీ కోసం పూజా హెగ్డే తంటాలు

Krithi Shetty: టాలెంట్ చూపిస్తున్న కృతి.. ఇప్పుడు ఉపయోగం లేదంటున్న ఫ్యాన్స్

Tamannaah Bhatia: అడ్వెంచర్ రోల్స్ కావాలంటున్న తమన్నా