Video: విశాఖలో ఇండియా – ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్స్.. నేటినుంచి ప్రాక్టీస్ షురూ.. వారికి ఫ్రీ టిక్కెట్స్..

| Edited By: Venkata Chari

Jan 31, 2024 | 1:04 PM

IND vs ENG 2nd Test: ఇండియా - ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు రోజుకు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీ ఇవ్వనుంది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్. ఈ నేపథ్యంలో వారి ఐడీ కార్డులను పరిశీలించి స్టేడియంలోకి పంపాలన్నారు. అదేవిధంగా రోజుకు 2,850 మంది చొప్పున 5 రోజులకు 14,250 మంది రాష్ట్రంలో ఉన్న క్లబ్‌ క్రీడా కారులకు ఉచిత ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి తెలిపారు.

IND vs ENG 2nd Test: విశాఖ వేదికగా ఫిబ్రవరి 2నుంచి భారత్ ఇంగ్లాడ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌ కు ఇరుజట్ల క్రికెటర్లు చేరుకున్నారు. వారికి విమానాశ్రయంలో అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. క్రికెటర్లను నేరుగా చూసే అవకాశం ఉండడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. తమ అభిమాన క్రికెటర్ల ను చూసి సంబరపడి పోయారు. ప్రత్యేక బస్‌లలో బీచ్ రోడ్‌లోని నోవా హోటల్‌కు వెళ్ళిన క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. హోటల్‌తో పాటు క్రికెటర్ల వెంట ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టింది విశాఖ నగర పోలీస్ కమిషనరేట్.

నేటినుంచి ఇరు జట్ల ప్రాక్టీస్..

ఇంగ్లాండ్ తో రెండో టెస్టు నేపథ్యంలో పీఎం పాలెంలోని బి గ్రౌండ్ లో బుధవారం ఉదయం 9.30 గంటలకు ఇంగ్లాండ్, మధ్యాహ్నం 1.30 గం. టీమిండియా జట్లు ప్రాక్టీస్ చేయనున్నారు. అదేవిధంగా గురువారం ఉదయం 9.30 గంటలకు టీమిండియా, మధ్యాహ్నం 1.30 గం. ఇంగ్లాండ్ జట్లు ప్రాక్టీస్ చేయనున్నాయి.

10 వేల మందికి విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ..

ఇండియా – ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు రోజుకు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీ ఇవ్వనుంది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్. ఈ నేపథ్యంలో వారి ఐడీ కార్డులను పరిశీలించి స్టేడియంలోకి పంపాలన్నారు. అదేవిధంగా రోజుకు 2,850 మంది చొప్పున 5 రోజులకు 14,250 మంది రాష్ట్రంలో ఉన్న క్లబ్‌ క్రీడా కారులకు ఉచిత ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..