టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య.. దిగ్గజాల జోస్యం !!
c30 ఏళ్ల వయసు పైబడిన రోహిత్, అశ్విన్, డీకే లాంటి సీనియర్ ఆటగాళ్లు టీ20ల నుంచి రిటైరయ్యే అవకాశాలు లేకపోలేదు. టీ20 జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
c30 ఏళ్ల వయసు పైబడిన రోహిత్, అశ్విన్, డీకే లాంటి సీనియర్ ఆటగాళ్లు టీ20ల నుంచి రిటైరయ్యే అవకాశాలు లేకపోలేదు. టీ20 జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. వచ్చే టీ20 వరల్డ్ కప్‌లోగా సీనియర్ల స్థానంలో యువ ఆటగాళ్లతో జట్టును నింపాలని సూచిస్తున్నారు. రిటైర్ కావాలని బీసీసీఐ ఎవరినీ కోరకపోయినా.. సీనియర్లే తమంతట తాము టీ20ల నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సునీల్ గావస్కర్ లాంటి మాజీ క్రికెటర్లు సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు సీనియర్లు టీ20ల నుంచి రిటైరయ్యే అవకాశం ఉందన్న సునీల్ గవాస్కర్.. హార్దిక్ పాండ్య భవిష్యత్తులో కచ్చితంగా కెప్టెన్ అవుతాడని జోస్యం చెప్పారు. ఇప్పటికే ఐపీఎల్‌లో సత్తా చాటిన పాండ్య.. టీ20ల్లో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చెప్పట్టేందుకు అర్హుడన్నారు గవాస్కర్. మరో మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్ సైతం ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను టీ20ల్లో ఫుల్ టైం కెప్టెన్‌గా నియమించాలని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సూచించాడు. రాహుల్ ద్రావిడ్‌ను అన్ని ఫార్మాట్లలోనూ హెడ్ కోచ్‌గా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తే.. టీ20 ఫార్మాట్‌ను అర్థం చేసుకునే నెహ్రాను సహాయకుడిగా నియమించాలని భజ్జీ సూచించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టెట్ హాల్ టికెట్ పై సన్నీ లియోన్ ఫొటో !! అభ్యర్థి షాక్ !!
19 ఏళ్ల నాటి రికార్డును తిరగరాసిన 50 ఏళ్ల మహిళ !!
కారులో వచ్చి కరెంట్ బల్బుల చోరి.. ఇది పెద్ద స్కెచ్చే !!
కొట్టేశా.. అని ఆనందంతో పరిగెత్తి… బొక్క బోర్లాపడ్డ దొంగ !! చివరికి ఏమైందంటే ??
‘మా అమ్మా సమంత’.. మనోడి మాటలు వింటే నవ్వలేక చస్తారు !!