గంభీర్ ఇంట్లో స్పెషల్ డిన్నర్.. స్పెషల్‌ లుక్స్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌

Updated on: Oct 10, 2025 | 5:52 PM

టీమిండియా ఆటగాళ్ల ప్రైవేట్‌ లైఫ్‌స్టైల్స్‌ గురించి వారి అభిమానులు ఎంతో అతృతగా సెర్చ్‌ చేస్తుంటారు. మైదానంలో బాల్‌, బ్యాట్‌తో అలరించే ఆటగాళ్లు బయట ఎలా ఉంటారు? అనేది ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అందుకే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉండే ఆటగాళ్లకు సంబంధించిన ఏ చిన్న అంశమైనా ఇట్లే వైరల్‌ అవుతూ ఉంటుంది.

అలాంటి అందరు ఆటగాళ్లూ ఒకే చోట చేరి సందడి చేస్తే ఇక ఫ్యాన్స్‌కు పండగే కదా. వెస్టిండీస్‌తో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు టీమిండియా క్రికెటర్లు, సహాయక సిబ్బందికి ఆ జట్టు హెడ్ కోచ్, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ న్యూఢిల్లీలోని తన నివాసంలో బుధవారం రాత్రి ఓ ప్రత్యేక విందు ఇచ్చారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఆటగాళ్ళ మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచడానికి, ఉల్లాసంగా గడపడానికి గంభీర్ ఈ విందు ఏర్పాటు చేశారు. గంభీర్ నివాసానికి భారత జట్టు సభ్యులు, సపోర్ట్ స్టాఫ్ మొత్తం ఒక బస్సులో వచ్చారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహా ఆటగాళ్లంతా సాధారణ దుస్తుల్లో కనిపించారు. గిల్ టీ-షర్ట్, బ్లూ డెనిమ్‌తో స్టైలిష్‌గా ఉండగా, జస్‌ప్రీత్ బుమ్రా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ వంటి చాలా మంది ఆటగాళ్లు తెల్లటి దుస్తుల్లో వచ్చారు. సహాయక సిబ్బందితో పాటు, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ఈ ప్రత్యేక విందుకు హాజరయ్యారు. రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ ఇప్పటికే అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసి 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ విజయంతో జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ ఉల్లాసకరమైన వాతావరణం రెండో టెస్టుకు ముందు ఆటగాళ్లకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ విందు ద్వారా ఆటగాళ్ల మధ్య బంధం మరింత బలపడి, మైదానంలో జట్టుగా మరింత మెరుగ్గా రాణించడానికి తోడ్పడుతుందని గంభీర్ ఆశించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mass Jathara: మాస్ జాతర పై బాహుబలి ప్రభావం ఎంత

Pooja Hegde: రీ ఎంట్రీ కోసం పూజా హెగ్డే తంటాలు

Krithi Shetty: టాలెంట్ చూపిస్తున్న కృతి.. ఇప్పుడు ఉపయోగం లేదంటున్న ఫ్యాన్స్

Tamannaah Bhatia: అడ్వెంచర్ రోల్స్ కావాలంటున్న తమన్నా

వానాకాలానికి.. నో ఎండ్‌ వచ్చే రెండ్రోజులూ వానలే