Watch Video: బంతి విసరకముందే నాన్‌స్ట్రైకర్‌ అత్యుత్సాహం.. ఇంత తొందరైతే ఎలా బ్రో అంటోన్న నెటిజన్లు.. వైరల్‌ వీడియో

ఈ వీడియో యూరోపియన్ లీగ్‌లో చోటుచేసుకుంది. దట్స్ సో విలేజ్ అనే ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోను పంచుకున్నారు. 2వేలకు పైగా లైక్స్, లక్షల వ్యూస్‌తో నెట్టింట్లో దూసుకపోతోంది.

Watch Video: బంతి విసరకముందే నాన్‌స్ట్రైకర్‌ అత్యుత్సాహం.. ఇంత తొందరైతే ఎలా బ్రో అంటోన్న నెటిజన్లు.. వైరల్‌ వీడియో
Cricket Viral Video

Updated on: Mar 14, 2022 | 8:18 PM

సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియో(Viral) ప్రతిరోజు వచ్చి చేరుతున్నాయి. ఇందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని మాత్రం నవ్వులు పూయిస్తుంటాయి. ఇలాంటి వాటిలో క్రీడలకు సంబంధించిన వీడియోలది కూడా సింహభాగంగానే ఉంది. నెటిజన్లకు ఎంతో ఆకట్టుకుంటూ తెగ సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా క్రీడల గురించి మాట్లాడితే క్రికెట్‌(Cricket) వీడియోలు ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. అరుదైన లేదా విశేషాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో సందడి చేస్తున్నాయి. తాజాగా క్రికెట్‌ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

ఈ వీడియో యూరోపియన్ లీగ్‌లో చోటుచేసుకుంది. దట్స్ సో విలేజ్ అనే ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోను పంచుకున్నారు. వార్తలు రాసే సమయానికి ఈ వీడియో 2వేలకు పైగా లైక్స్, లక్షల వ్యూస్‌తో నెట్టింట్లో దూసుకపోతోంది. బౌలర్ బౌలింగ్ వేసుందుకు పరిగెత్తుతూ వస్తున్నట్లు ఈ వీడియోలో చూడొచ్చు. అయితే, నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ మాత్రం బౌలర్‌‌ను గమనించకుండా, అది కూడా బంతి విసరకముందే పరుగు లంఖించుకున్నాడు. అలా పరిగెడుతూ సగం పిచ్ దాటి వెళ్లాడు. ఇది గమనించిన బౌలర్ బాల్ వేయకుండా ఆగిపోయాడు.

అయితే, బౌలర్‌ మన్కడింగ్‌ చేసే అవకాశం ఉంది. నాన్ స్ట్రైకర్‌ను మన్కడింగ్‌తో పెవిలియన్ చేర్చకుండా అంపైర్‌కు ఫిర్యాడు చేయడం గమనార్హం. బౌలర్ ఫిర్యాదు మేరకు ఆ బ్యాట్స్‌మన్‌ను అంపైర్ హెచ్చరించినట్లు వీడియోలో చూడొచ్చు. బ్యాటర్ చేసిన పనికి వ్యాఖ్యాతలు, ప్లేయర్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Also Read: Watch Video: పింక్ బాల్ టెస్ట్.. టీమిండియా ది బెస్ట్.. ఈ రికార్డులు చూస్తే మీరూ వావ్ అనాల్సిందే..!

Viral Video: ఇలాంటి బరాత్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. ఎంతమంది ఉన్నారో చూస్తే షాకవ్వాల్సిందే.. వైరల్ వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us