World Athletics Championship: చివరి పోరులో చేజారిన పతకం..ఊహించని ప్రమాదంలో ఆటగాడు..(వీడియో)

|

Aug 04, 2022 | 8:52 AM

ప్రస్తుతం అమెరికాలో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు.


ప్రస్తుతం అమెరికాలో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు. కానీ ఇదే ఛాంపియన్‌షిప్‌లో మరో ఆటగాడు పొరపాటున ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ టోర్నీలో చెక్ రిపబ్లిక్ ఆటగాడికి ప్రమాదం జరిగింది. పోల్ వాల్టర్ అయిన జిరి సియాకోరా. పతకం సాధించాలని తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ, మధ్యలో అతనికి ప్రమాదం జరిగింది. నెట్టింట్లో షేర్ చేసిన ఈ వీడియో, అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది.డెకాథ్లాన్ ఎనిమిదో ఈవెంట్‌లో జిరి తన సత్తాను చాటేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలోనే ఆయనకు ప్రమాదం జరిగింది. ఈ పోల్ వాల్టర్ తన మొదటి ప్రయత్నంలోనే 4.10 మీటర్ల దూరాన్ని అధిగమించాడు. ఆ తర్వాత 4.30 మీటర్ల దూరాన్ని కూడా అధిగమించాడు. మూడో ప్రయత్నం చేయబోతుండగా, అతని కర్ర విరిగిపోయి కింద పడిపోయాడు. దాంతో కొన్ని మీటర్లు మాత్రమే వెళ్లగలిగాడు. దీంతో జిరి తన పేరును ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో అతని చేయి విరిగినట్లు తెలుస్తోంది. జిరి ఒక జూనియర్ డెకాథ్లాన్ ఛాంపియన్. జిరి ఈ ఈవెంట్‌లో పతకం కోసం రేసులో ఉన్నాడు. కానీ, గాయం కారణంగా రేసు నుంచి తప్పుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అతని ప్రయాణం ముగిసింది. ఇక ఈ ఈవెంట్‌లో ఫ్రెంచ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కెవిన్ మీర్ విజేతగా నిలిచాడు .

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us on