రేపటి నుంచి అసెంబ్లీలో AI ఆధారిత అటెండెన్స్

Updated on: Feb 11, 2026 | 9:13 PM

స్పీకర్ అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ రేపటి నుంచి అసెంబ్లీలో AI ఆధారిత అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పెద్ద కంపెనీల మాదిరిగానే సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదవుతుంది. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను ఏప్రిల్‌లో ప్రారంభించనున్నట్లు, 2028 డిసెంబర్ నాటికి కొత్త అసెంబ్లీ భవనంలో సమావేశాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

స్పీకర్ అయ్యన్న పాత్రుడు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత అటెండెన్స్ విధానం అమలులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు బయోమెట్రిక్ విధానాన్ని వినియోగిస్తున్నారని, పార్లమెంట్‌లో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఉందని పేర్కొంటూ, ఇక్కడ కూడా ఇది ఉంటే మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కొత్త విధానంలో సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే వారి హాజరు నమోదు అవుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెదక్ జిల్లా అలియాబాద్ లో నకిలీ వెండి కాయిన్స్ కలకలం

ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో.. అగ్నిప్రమాదం

ప్రపంచానికే దిక్సూచిగా అమరావతి క్వాంటం వ్యాలీ

TOP 5 ET: పెద్దికి బిగ్గెస్ట్ డీల్..NTR క్రేజ్‌కు 140 కోట్లు?|బాలయ్యే కావాలంటున్న స్టార్ డైరెక్టర్లు

TOP 9 ET : ఆమెకు.. బన్నీ టీం హెచ్చరిక | ప్రభాస్‌ డేట్సే ఇక్కడ ఇష్యూ