విశాఖ రైల్వే జోన్ కల నెరవేరింది.. కానీ ఇప్పడు మరో సమస్య వచ్చి పడింది

Updated on: Apr 08, 2026 | 6:09 PM

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కల నెరవేరుతున్న వేళ, కేకే లైన్ భవితవ్యంపై తీవ్ర ఆందోళన నెలకొంది. అధిక ఆదాయ వనరుగా ఉన్న కేకే లైన్‌ను రాయగడకు కేటాయిస్తే, విశాఖ జోన్‌కు 60 శాతం పైగా ఆదాయం తగ్గుతుందనే భయం వ్యక్తమవుతోంది. ఇది ఉద్యోగులకు, స్థానికులకు సమస్యలు సృష్టిస్తుందని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

ఎన్నో ఏళ్ల కలైన విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. రైల్వే జీఎం తాత్కాలిక కార్యాలయం కూడా సిద్ధమైంది. అయితే, ఈ జోన్ ఏర్పాటుతో పాటు కొత్త వివాదం తెరపైకి వచ్చింది: వాల్తేరు డివిజన్ పరిధిలోని అత్యంత లాభదాయకమైన కొత్తవలసా-కిరండూల్ (కేకే) లైన్‌ను రాయగడ డివిజన్‌కు కేటాయించడం. గత ఆర్థిక సంవత్సరంలో వాల్తేరు డివిజన్ రైల్వేలో ఐదవ అత్యధిక ఆదాయం సాధించింది, కేవలం లోడింగ్ ద్వారానే భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంది. కేకే లైన్‌ను కోల్పోతే కొత్తగా ఏర్పడబోయే విశాఖ జోన్‌కు 60 శాతం పైగా ఆదాయం తగ్గుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఆర్థిక నష్టమే కాకుండా, ఈ లైన్‌లోని 12 ఏపీ పరిధిలోని రైల్వే స్టేషన్లలో పనిచేసే ఉద్యోగులకు సాంకేతిక, పరిపాలనా సమస్యలను సృష్టిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా సైదాబేగం యత్నం

పూర్తిస్థాయి శాంతి ఒప్పందం దిశగా అమెరికా – ఇరాన్

అవుట్ సైడ్ ఫుడ్ తింటే దవాఖానలో బెడ్డే..!

వరంగల్‌లో కుక్కల అరాచకం! వేలు తెగేలా కొరికిన పిచ్చికుక్క

ఇద్దరు ఇంజినీరింగ్ పిల్లల ప్రాణం తీసిన తాగుబోతు

Follow Us