గదిలో దగ్గుమందు.. ఓవర్‌డోస్‌ ఇచ్చి చంపిందా ??

|

Jan 12, 2024 | 9:41 PM

నాలుగేళ్ల కొడుకుని గోవాలో హత్య చేసి.. మృతదేహాన్ని సూటుకేసులో పెట్టి, టాక్సీలో కర్ణాటక తీసుకొచ్చి అక్కడ అరెస్టయిన సీఈవో కేసు... దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ముందస్తు ప్రణాళికతోనే ఆమె తన కుమారుడిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన గదిలో కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. అంతేకాదు పోస్ట్‌మార్టం రిపోర్టులో కీలక విషయాలు బయటికొచ్చాయి. హత్యకు ముందు ఆ చిన్నారికి దగ్గు మందు ఓవర్‌డోస్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నాలుగేళ్ల కొడుకుని గోవాలో హత్య చేసి.. మృతదేహాన్ని సూటుకేసులో పెట్టి, టాక్సీలో కర్ణాటక తీసుకొచ్చి అక్కడ అరెస్టయిన సీఈవో కేసు… దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ముందస్తు ప్రణాళికతోనే ఆమె తన కుమారుడిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన గదిలో కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. అంతేకాదు పోస్ట్‌మార్టం రిపోర్టులో కీలక విషయాలు బయటికొచ్చాయి. హత్యకు ముందు ఆ చిన్నారికి దగ్గు మందు ఓవర్‌డోస్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బాలుడిని దిండు లేదా దుస్తులతో ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది. వివరాలను అధికారులు బుధవారం మీడియాకు తెలియజేశారు. కుమారుడిని హత్య చేసిన కేసులో బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ సీఈవో సుచనా సేఠ్‌ ను గత సోమవారం రాత్రి చిత్రదుర్గలో అరెస్టు చేసి గోవాకు తీసుకొచ్చారు. అక్కడ ఆమె అద్దెకు తీసుకున్న సర్వీస్‌ అపార్ట్‌మెంట్ గదిని తనిఖీ చేయగా.. రెండు ఖాళీ దగ్గు మందు సీసాలు కన్పించాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్య రామయ్యకు భక్తితో బంగారు పాదుకలు..

ప్రాణం తీసిన బొగ్గుల కుంపటి.. గదిలోనే సమాధి

డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న వాటర్‌ బాటిళ్లు !! 2.4 లక్షల ప్లాస్టిక్‌ రేణువులు