తెలంగాణలో విరబూసిన కుంకుమ పువ్వు

|

Oct 18, 2024 | 12:14 PM

కుంకుమ పువ్వు ఒకరకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. కుంకుమ పువ్వును ఇంగ్లీషులో శాఫ్రాన్‌ ఫ్రాన్‌ అంటారు. ఇది జాఫరాన్‌ అనే అరబిక్‌ పదం నుంచి వచ్చింది. అరబిక్‌లో జాఫరిన్‌ అంటే పసుపు అని అర్థం. కుంకుమ పువ్వు అందించే మొక్కలను ప్రత్యేకంగా పెంచుతారు. పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారు చేస్తారు. ఒక కిలో కుంకుమపువ్వు తయారు చేయాలంటే కనీసం రెండు లక్షల పూలు అవసరమవుతాయి.

అందుకే వీటి ధర చాలా అధికంగా ఉంటుంది. అందుకే దీనిని బంగారంలాగా తులాల లెక్కన సేల్ చేస్తారు. కుంకుమ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటుంది. కుంకుమపువ్వు… పేరు వినగానే కాశ్మీర్‌ గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనదేశంలో ఇది కేవలం అక్కడ మాత్రమే పండుతుంది. కానీ నిజానికి దీని స్వస్థలం దక్షిణ ఐరోపా. అక్కడ నుంచే వివిధ దేశాలకు విస్తరించింది. గ్రీసు, స్పెయిన్‌, ఇరాక్‌, ఇటలీ, సిసిలీ, టర్కీ, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో దీన్ని ఎక్కువగా పండిస్తారు. అయితే అన్నింటిలోకీ కాశ్మీరీ కేసర్‌ నాణ్యమైనది. మనదేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో దీనిని ‘కేసర్‌’ అంటారు. కుంకుమ పువ్వు పండాలి అంటే వాతావరణంలో అధిక తేమ అస్సలు ఉండకూడదు. మట్టి గుల్లగా ఉండాలి, అత్యధికంగా ప్రకృతిసిద్ధమైన ఎరువులు వాడాలి, వర్షపాతం తక్కువగా ఉండాలి. దుంప నాటిన రెండు నెలలకే పుష్పాలు పూస్తాయి. శీతాకాలం చివరలో కుంకుమ పువ్వు పంట కోతకు వస్తుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తే.. మూడో ప్రపంచ యుద్ధమేనా ??