Sabarimala: శబరికి వెళ్లే అయ్యప్పలకు బిగ్ అలర్ట్.. ఈ విషయాలు తెలుసుకోండి
శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ అటవీ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. సన్నిధానం సమీపంలోని ఉరళ్‌కుళి జలపాతం వద్దకు వెళ్లవద్దని సూచించింది. ఇది అటవీ నిషేధిత ప్రాంతమని, వన్యప్రాణుల సంచారం, ముఖ్యంగా ఏనుగుల గుంపు ఎక్కువగా ఉంటుందని, జారిపడే ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా ఈ ప్రాంతానికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాములకు అలర్ట్ జారీ చేశారు కేరళ అటవీశాఖ అధికారులు. అయ్యప్ప సన్నిధానం సమీపంలోని ఉరళ్‌కుళి జలపాతం వద్దకు వెళ్లొద్దని సూచించింది. అది అటవీ నిషేధిత ప్రాంతమని.. అక్కడికి భక్తుల ప్రవేశంపై నిషేధం ఉందని తెలిపింది. ఉరళ్‌కుళి వాటర్‌ఫాల్స్ వద్ద అటవి జంతువుల సంచారం ఎక్కువగా ఉంటుందని.. అటు వైపు వెళ్లి భక్తులు అనవసరంగా ప్రమాదంలో పడొద్దని అటవీ అధికారులు సూచించారు. వన్యప్రాణుల దాడులు, ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నందున ఆలయం సమీపంలోని ఉరళ్‌కుళి జలపాతాన్ని సందర్శించవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు, ఆ ప్రాంతంలోని భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని, భక్తుల భద్రత దృష్ట్యా సన్నిధానం స్పెషల్ డ్యూటీ రేంజ్ ఆఫీసర్ అరవింద్ బాలకృష్ణన్ ఈ సూచనలు జారీ చేశారు. అయ్యప్ప సన్నిధానానికి అటవీ మార్గం గుండా వెళ్లే కొందరు భక్తులు ఉరళ్‌కుళి జలపాతం వద్ద స్నానం చేసి స్వామిని దర్శించుకోవడానికి వెళుతున్నారని బాలకృష్ణన్ పేర్కొన్నారు. పండితవాళానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం వద్ద ఇటీవల తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఈ ప్రాంతంలోకి ప్రవేశం పూర్తిగా నిషేధించబడిందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తూ ఉంటుందని, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఈ జలపాతానికి దూరంగా ఉండాలని భక్తులను హెచ్చరించారు. జలపాతానికి వెళ్లే మార్గం జారే స్వభావం కలిగి ఉండటం వల్ల తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కాబట్టి, శబరిమల వచ్చే భక్తులు ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత ఎలక్ట్రిక్ బస్సులతో పాటు.. ఇది కూడా
Tirumala: తిరుమల శ్రీవారికి భక్తురాలు కోటి విరాళం..
కారును ఢీకొన్న విమానం.. ఫ్లోరిడా రోడ్డుపై షాకింగ్ ఘటన
Akhanda 2 Review: లాజిక్స్ లేవమ్మా.. అన్నీ గూస్ బంప్సే!’ అఖండ2 మూవీ రివ్యూ