ఎదురెదురుగా ఢీకొన్న RTC బస్సు, కారు

Updated on: Nov 05, 2025 | 3:22 PM

నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలం విటోలి-ముధోల్ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారులో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అలాగే, బస్సులోని ప్రయాణికులు కూడా ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో బస్సు ప్రమాదం వార్తలు వినబడుతూనే ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో బస్సు ప్రమాదం వార్తలు వినబడుతూనే ఉన్నాయి. తాజాగా, నిర్మల్ జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముధోల్ మండలంలోని విటోలి-ముధోల్ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, కారు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు అష్టా గ్రామం నుంచి భైంసా వైపు వెళ్తుండగా, కారు ముధోల్ నుంచి లోకేశ్వరం మండలం వాటోలికి వెళ్తున్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో కారులో ఉన్న వారందరూ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. అదేవిధంగా, ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు కూడా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉమెన్‌ టీమిండియాపై సినీ సెలబ్రిటీల ప్రశంసల వ‌ర్షం..

Gold Price Today: గుడ్‌న్యూస్‌.. తగ్గుతున్న బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే ??

Rain Alert: రెండు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు

Published on: Nov 05, 2025 03:21 PM