కల్తీ ఆయిల్ తయారు చేసి టిఫిన్ సెంటర్లు, బేకరీలకు సరఫరా
కాసులకు కకుర్తి పడుతూ కొంతమంది కేటుగాళ్లు పబ్లిక్ ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు. ఊరి శివారులో నిత్యవసర వస్తువుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి కనీస ప్రమాణాలు పాటించకుండా కల్తీ చేసి అమ్మేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా నడిచే ఈ కల్తీ దందా ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా లోని మైలవరం లో కల్తీ నూనె కలకలం రేపింది. నకిలీ వంట నూనె అమ్ముతున్నారంటూ స్థానికులు ఇచ్చిన సమాచారంతో రెవెన్యూ అధికారులు మిల్లులో తనిఖీలు చేశారు.
కాసులకు కకుర్తి పడుతూ కొంతమంది కేటుగాళ్లు పబ్లిక్ ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు. ఊరి శివారులో నిత్యవసర వస్తువుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి కనీస ప్రమాణాలు పాటించకుండా కల్తీ చేసి అమ్మేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా నడిచే ఈ కల్తీ దందా ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా లోని మైలవరం లో కల్తీ నూనె కలకలం రేపింది. నకిలీ వంట నూనె అమ్ముతున్నారంటూ స్థానికులు ఇచ్చిన సమాచారంతో రెవెన్యూ అధికారులు మిల్లులో తనిఖీలు చేశారు. అక్కడ మిల్లులో డబ్బాల్లో నూనె నింపి సరఫరాకు రెడీగా ఉన్న కొన్ని డబ్బాల్లో నూనెను మొత్తం ఒంపేశారు. ఈ కల్తీ నూనె చిన్న, చిన్న టిఫిన్ సెంటర్లు, బేకరీ, సమోసా సెంటర్లకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. కల్తీ నూనె మిల్లు నిర్వాహకుడి నుంచి స్టేట్ రికార్డ్ చేసిన అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోజు రోజుకు వంట నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలతో పాటు కల్తీ కూడా పెరుగుతోంది. ఈక్రమంలో తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం కోసం కొంతమంది వ్యాపారస్తులు కల్తీ ఆయిల్ తయారీకి తెరతీస్తున్నారు. ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్ అనే ఒక రసాయనాన్ని ఉపయోగించి నకిలీ ఆయిల్ తయారు చేసి, బ్రాండెడ్ స్టిక్కర్లు వేసి విక్రయిస్తున్నారు. ఇలాంటి ఆయిల్స్ వాడటం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి పక్షవాతం లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మ్యూజిక్ ఫెస్ట్‌పై విరుచుకుపడిన మిలిటెంట్లు.. కార్లలో దాక్కున్నా వదల్లేదు..
విద్యార్థినుల వాష్‌రూంలో రహస్య కెమెరాలతో రికార్డింగ్
సినీ ఫక్కీలో పోలీసులనుంచి తప్పించుకున్నాడు.. వీడియో చూస్తే
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కు అరుదైన గౌరవం
గుడ్ న్యూస్.. చీరమేను చేప వచ్చిందోచ్.. కేజీ ఎంతంటే ??