టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని మళ్ళీ వేడి చేసి తాగడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. ఇది జీర్ణవ్యవస్థను, కాలేయాన్ని దెబ్బతీస్తుంది. టీ పౌడర్‌లో బ్యాక్టీరియా వృద్ధి చెంది, విషంగా మారే అవకాశం ఉంది. పాలు కలిపిన టీని రెండు గంటల్లోపు తాగాలి. పోషకాలు నశించి, ఆమ్లత్వం పెరుగుతుంది. ఎల్లప్పుడూ తాజా టీనే తాగడం ఉత్తమం. ఉదయం నిద్రలేచిన వెంటనే టీ తాగడం చాలా మందికి అలవాటు.
ఉదయం నిద్రలేచిన వెంటనే టీ తాగడం చాలా మందికి అలవాటు. కొందరికైతే టీ తాగందే రోజే స్టార్ట్ కాదు.కానీ ఈ అలవాటు చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఇటీవల వెలువడిన కొన్ని అధ్యయనాల ప్రకారం.. మీరు ఒక్కసారి టీని కాచిన తర్వాత.. దాన్ని 15 నుంచి 20 నిమిషాల్లో తాగాలి.. అలా కాదని.. దాన్ని రెండోసారి వేడి చేసుకొని తాగితే చాలా ప్రమాదం అని చెబుతున్నారు. దానివల్ల కాలేయం, జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందన్నారు. ఈ అలవాటు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా టీ కాచిన తర్వాత అందులో మిగిలిపోయే టీ పౌడర్ బ్యాక్టీరియాకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుందని పరిశోధకులు హెచ్చరించారు. జపాన్, చైనా వంటి దేశాలలో ఎక్కువ సమయం నిల్వ చేసిన టీని విషంగా భావిస్తారట. 24 గంటలకు పైగా నిల్వ చేసిన టీ తాగడం పాముకాటు కంటే ప్రమాదకరమని జపనీయులు అంటారు. మన భారతదేశంలో ఎక్కువగా పాలతో చేసే టీనే ప్రజలు తాగుతారు. అయితే పాలు త్వరగా చెడిపోయే లక్షణాన్ని కలిగి ఉంటాయి. పాలతో తయారుచేసిన టీని గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటలకు మించి ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచితే ఒకటి నుంచి మూడు రోజులు నిల్వ చేయవచ్చు, కానీ మళ్లీ వేడి చేయడం వల్ల అందులోని పోషకాలు నశిస్తాయి. అంతేకాదు టీలో ఆమ్లత్వం పెరిగి అది విషంగా మారే ప్రమాదం ఉంది. చాలా మంది సువాసన, టేస్ట్ కోసం టీలో అల్లం వేసుకుంటారు. అల్లం టీ పాలు లేకుండా తాగడం సురక్షితమే. కానీ టీని ఎక్కువ సమయం నిల్వ చేసినప్పుడు ఒకసారి దాన్ని చెక్ చేయాలి. ఒకవేళ టీ రంగు మారినా, స్మెల్ వచ్చినా దాని జోలికి వెళ్లకపోవడమే బెటర్. రోజుకు 4 నుండి 5 గ్రాముల కంటే ఎక్కువ అల్లం తీసుకోవడం వల్ల కొంతమందికి గుండెల్లో మంట వచ్చే ప్రమాదం ఉంది. ఆయుర్వేదం ప్రకారం టీని నిల్వ చేయడం లేదా మళ్లీ వేడి చేసి తాగడం వల్ల మన శరీరంలోకి విష పదార్థాలు ప్రవేశిస్తాయి, దీంతో పాటు జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. టీని పదే పదే వేడి చేయడం వల్ల దానిలో ఉన్న పోషకాలు నాశనం అవుతాయి. అది ఆమ్లత్వంగా మారి కడుపులో మంట వంటి సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి మీరు టీ తాగాలని భావిస్తే, ప్రతిసారీ తాజాగా తయారు చేసుకోవడం ఉత్తమం కానీ ఒకసారి కాచిన టీనే మళ్లీ మళ్లీ వేడి చేసుకొని తాగడం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిదికాదంటున్నారు నిపుణులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
Gold Price Today: ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. శనివారం తులం ఎంతంటే..
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ… కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే