ఈ మొక్క సర్వరోగ నివారిణి..ఎక్కడ కనిపించినా వదిలిపెట్టకండి
ప్రస్తుతం చాలా మంది మొక్కల పెంపకంపై ఇష్టం పెంచుకుంటున్నారు. ఎంత చిన్నా ఇల్లు ఉన్నా సరే.. అవసరమైన ఔషధ మొక్కలు, ఆకులు కూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను పెంచుతున్నారు. టెర్రస్ గార్డెన్ పేరుతో కొందరు చిన్నపాటి వ్యవసాయమే చేస్తున్నారు. ఇకపోతే, ఇంటి ఆవరణలో పెంచుకునే ఔషధ మొక్కలలో రణపాల మొక్క కూడా ఒకటి.
దీని శాస్త్రీయ నామం బ్రయోఫిలం పిన్నటం. ఆయుర్వేదంలో ఈ రణపాల మొక్కను ఎన్నో ఏళ్లుగా అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషధంగా ఉపయోగిస్తున్నారు. రణపాల మొక్క ఆకులు మందంగా, వగరు, పులుపు రుచిని కలిగి ఉంటాయి. ఈ మొక్కలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల బీపీ, షుగర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయని అంటున్నారు. మూత్రపిండాల్లో రాళ్లతో పాటు మూత్రసంబంధింత సమస్యలను కూడా రణపాల మొక్కను ఉపయోగించి నయం చేసుకోవచ్చునని సూచిస్తున్నారు. అంటు వ్యాధులు, గాయాలు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి రణపాల అద్భుత మూలికా ఔషధంగా చెబుతున్నారు. రణపాల ఆకులతో టీ తయారు చేసుకుని తాగడం వల్ల తిమ్మిర్లు, ఉబ్బసం వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు. ఈ మొక్క ఆకులను పేస్ట్ గా చేసి లేపనంగా రాసుకోవడం వల్ల నడుము నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు నయం చేస్తుంది.. మొలల సమస్యతో బాధపడే వారు రణపాల మొక్క ఆకుల్లో మిరియాలు కలిపి తినడం వల్ల మొలల సమస్య నుండి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: