YSRTP ఎటూ పోలేదు.. తనయుడి నిశ్చితార్థంలో షర్మిల కీలక కామెంట్స్

Edited By: Ram Naramaneni

Updated on: Jan 18, 2024 | 7:39 PM

హైదరాబాద్‌ గండిపేటలోని ఒక రిసార్టులో షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు రాజారెడ్డి మేనమామ, ఏపీ సీఎం జగన్‌ హైదరాబాద్‌ వచ్చారు. వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత వైఎస్‌ కుటుంబంలో జరుగుతున్న తొలి శుభకార్యం కావడంతో వైఎస్‌ కుటుంబ సభ్యులు ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

హైదరాబాద్, జనవరి 18:  YSR తెలంగాణ పార్టీ ఎటూ పోలేదని..  కాంగ్రెస్ పార్టీలోనే ఉందన్నారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ బతికున్నంత కాలం.. YSRTP బ్రతికుంటదన్నారు. ఫ్యామిలీ ఈవెంట్ జరుగుతుందని.. అందరూ ఓపిగ్గా ఉండాలని షర్మిల కోరారు. కుటుంబ సభ్యులతో కార్యక్రమం ముగిసిన తర్వాత అందరూ లోపలికి రావాలని కోరారు షర్మిల.

హైదరాబాద్‌ గండిపేటలోని ఒక రిసార్టులో షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు రాజారెడ్డి మేనమామ, ఏపీ సీఎం జగన్‌ హైదరాబాద్‌ వచ్చారు. వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత వైఎస్‌ కుటుంబంలో జరుగుతున్న తొలి శుభకార్యం కావడంతో వైఎస్‌ కుటుంబ సభ్యులు ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహం వచ్చే నెల 17న జరగనుంది. జైపూర్‌లో వివాహ వేడుక ఉండే అవకాశం ఉంది. వివాహ వేడుకకు హాజరుకావాలని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను షర్మిల స్వయంగా ఆహ్వానించారు. తాడేపల్లి వెళ్లి అన్న జగన్‌కు కూడా పెళ్లి పత్రిక అందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Jan 18, 2024 07:37 PM