TS Power War: పవర్.. ఫుల్ పాలిటిక్స్.. తెలంగాణలో విద్యుత్ కోతలపై విపక్షాల ఆందోళనలు
తెలంగాణలో కోతలు లేకుండా నిరంతరం పవర్ అందిస్తున్నామని అందుకే బీఆర్ఎస్ పార్టీ చేతికి మళ్లీ మళ్లీ పవర్ ఇచ్చారంటూ తాజాగా హరీష్‌రావు అసెంబ్లీలో ప్రకటించారు.
తెలంగాణ రాజకీయాల్లోకి అనూహ్యంగా తెరమీదకు వచ్చింది విద్యుత్ కోతల వ్యవహారం. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కరెంట్ కోతలపై అన్నదాతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం కోతలు ఎందుకు పెడుతుందని అసెంబ్లీలో ఏకంగా ఇటీవల వాయిదా తీర్మానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 24గంటల కరెంట్ పై పచ్చి అబద్దాలు చెబుతున్నారంటున్న ఇతర పార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. రోడ్డుపైకి వచ్చి నిరసనలు కూడా తెలుపుతున్నారు. గల్లీ నుంచి అసెంబ్లీ దాకా విద్యుత్ కోతలపై వార్ నడుస్తోంది. అటు ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామంటోంది… ఎక్కడా ఇస్తున్నారో చూపించాలని ఇటు విపక్షాలంటున్నాయి. ఇంతకీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలేంటి? రైతుల ఆందోళనల వెనక విపక్షాల కుట్ర ఉందా? లేక సమస్య తీవ్రంగా ఉండటంతోనే రైతులు నిరసన బాట పట్టారా?