Weekend Hour: అబ్ కి బార్ కిస్కా సర్కార్..! ట్రయాంగిల్ ఫైట్‌లో కలిసొచ్చేదెవరికి..
Weekend Hour With Murali Krishna: ఓరుగల్లు వేదికగా తెలంగాణాలో ఎన్నికల పోరు మొదలైంది. హనుమకొండ సభలో కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనపై నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ. మరోవైపు తెలంగాణకు ఇచ్చిన హామీల సంగతేంటని ప్రధానిని ప్రశ్నించారు బీఆర్‌ఎస్ నేతలు.
Weekend Hour With Murali Krishna: ఓరుగల్లు వేదికగా తెలంగాణాలో ఎన్నికల పోరు మొదలైంది. హనుమకొండ సభలో కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనపై నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ. మరోవైపు తెలంగాణకు ఇచ్చిన హామీల సంగతేంటని ప్రధానిని ప్రశ్నించారు బీఆర్‌ఎస్ నేతలు. వీటికి భిన్నంగా రెండు పార్టీల మధ్య నడుస్తున్న డ్రామాలో భాగంగానే పరస్పర విమర్శలు అంటోంది కాంగ్రెస్.
ఓరుగల్లు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోట తూటాల్లా పేలిన మాటలు.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతల నుంచి రియాక్షన్స్ మిసైల్స్‌లా దూసుకొస్తున్నాయి.. అటే నేనున్నానంటూ కాంగ్రెస్ నేతలు కూడా విమర్శల జడివాన కురిపిస్తున్నారు…
విజయసంకల్ప సభలో మాట్లాడిన మోదీ తమ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చెబుతూనే.. తెలంగాణలో ప్రత్యర్ధులపై విమర్శలతో విరుచుకపడ్డారు. రాష్ట్రంలో అవినీతి లేని ప్రాజెక్టు లేదన్న ప్రధాని.. దర్యాప్తు సంస్థలు గురిపెట్టడంతో వాటి నుంచి దృష్టి మరల్చేందుకే కేసీఆర్ డైవర్ట్ రాజకీయాలకు తెరతీశారన్నారు. తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత వేచిచూస్తోందని, విద్యార్థులను, ఉద్యమకారులను కూడా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. తెలంగాణలోకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ప్రమాదకరమని వాటిని తరిమికొట్టాలన్నారు నరేంద్రమోదీ.
మోదీ విమర్శలపై భగ్గుమన్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించకుండా విమర్శలు చేయడం దారుణమన్నారు. అవినీతిలో కాంగ్రెస్ రాజుగా ఉంటే.. బీజేపీ రారాజుగా మారిందన్నారు. అటు బీఆర్ఎస్-బీజేపీ మధ్య రహస్య ఒప్పందంలో భాగంగానే మోదీ పర్యటన జరిగిందంటోంది కాంగ్రెస్ పార్టీ.
ఊహించినట్టుగానే మోదీ టూర్ తెలంగాణాలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ అంటుంటే… కౌంటర్‌గా బీజేపీ సర్కార్ అంటున్నారు మోదీ. ఇందిరమ్మ రాజ్యమని కాంగ్రెస్ అంటోంది.. ఇంతకీ తెలంగాణ ప్రజలు ఏ రాజ్యం కోరుకుంటున్నారు?
