టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం -సీపీఐ నారాయణ
టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నామన్నారు సీపీఐ నారాయణ. ఏపీలో టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. బీజేపీతో అంటకాగే పార్టీలకు ప్రజలు ఓటు వేయరని నారాయణ పేర్కొన్నారు. ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేవారితోనే సీపీఐ పొత్తు పెట్టుకుంటుందన్నారు.
టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నామన్నారు సీపీఐ నారాయణ. ఏపీలో టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. బీజేపీతో అంటకాగే పార్టీలకు ప్రజలు ఓటు వేయరని నారాయణ పేర్కొన్నారు. ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేవారితోనే సీపీఐ పొత్తు పెట్టుకుంటుందన్నారు. బీజేపీ వల్ల తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా లేదని… విభజన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. అయినప్పటికీ మోడీని వ్యతిరేకిస్తే తమకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అనే భయంతో ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయని ఆరోపించారు సీపీఐ నారాయణ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..