Big News Big Debate LIVE: పొత్తుల చుట్టూ తిరుగుతోన్న ఏపీ రాజకీయం.. ఆ రెండు పార్టీలు జతకట్టినట్లేనా..

Edited By:

Updated on: May 01, 2023 | 10:02 PM

ఏపీలో ప్రస్తుతం పొత్తుల చుట్టూనే రాజకీయం తిరుగుతోంది.. టీడీపీ జనసేన పొత్తు ఫిక్స్ అయ్యిందనేది మెజార్టీ అభిప్రాయంగా ఉంది. చంద్రబాబు- పవన్‌ భేటి జరిగిన 24 గంటల్లోనే లోకేష్‌ పాదయాత్రలో జనసేన జెండాలు ప్రత్యక్ష్యం అయ్యాయి. అయితే ఆ కూటమితో బీజేపీ కలిసి వెళ్తుందా లేదా అన్నదే తేలియాల్సి ఉంది...

ఏపీలో ప్రస్తుతం పొత్తుల చుట్టూనే రాజకీయం తిరుగుతోంది.. టీడీపీ జనసేన పొత్తు ఫిక్స్ అయ్యిందనేది మెజార్టీ అభిప్రాయంగా ఉంది. చంద్రబాబు- పవన్‌ భేటి జరిగిన 24 గంటల్లోనే లోకేష్‌ పాదయాత్రలో జనసేన జెండాలు ప్రత్యక్ష్యం అయ్యాయి. అయితే ఆ కూటమితో బీజేపీ కలిసి వెళ్తుందా లేదా అన్నదే తేలియాల్సి ఉంది. అయితే దీనిపై నాయకులు ఎవరికి వారు సొంత వెర్షన్లు వినిపిస్తున్నారు. మనం కూడా కలిసివెళదామంటూ కాషాయంతో కొందరు నాయకులు తొందరపడుతుంటే.. ఇంకొందరు నేతలు మాత్రం కుటుంబపార్టీలతో స్నేహం వద్దే వద్దంటున్నారు. అయినా వీళ్ల చేతిలో ఏముంటుంది… పొత్తులపై నిర్ణయం తీసుకోవాల్సింది జాతీయ నాయకత్వం కదా అంటూ పబ్లిక్‌ అంటున్నారు.

Published on: May 01, 2023 07:04 PM