Watch: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

|

Aug 18, 2024 | 4:06 PM

Telangana Politics: బీఆర్ఎస్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. త్వరలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్లాన్ సిద్ధమయ్యిందన్నారు. అందుకే కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారన్నారు. కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని అన్నారు. 

బీఆర్ఎస్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. త్వరలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. దీనికి సంబంధించి పక్కా ప్లాన్ రెడీ అయ్యిందన్నారు. అందుకే కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారన్నారు. కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని అన్నారు.  బీఆర్ఎస్ త్వరలో బీజేపీలో విలీనం అవుతుందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. ఏమీ లేని బీఆర్ఎస్‌ను మేమెందుకు కలుపుకుంటామని ప్రశ్నించిన ఆయన.. ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కుటుంబ పార్టీలకు బీజేపీ దూరమని చెప్పారు.

గతంలో సీఎల్పీ, బీఆర్‌ఎస్‌లో విలీనమైందని గుర్తుచేసిన బండి సంజయ్.. ఇప్పుడు కాంగ్రెస్‌లో BRS విలీనానికి రేవంత్‌ ప్లాన్‌ చేశారని అన్నారు. 6 గ్యారంటీలను పక్కదోవ పట్టించడానికే కాంగ్రెస్ నేతలు విలీన ప్రచారం చేస్తున్నారని అన్నారు. రుణమాఫీపై రైతులు ఆందోళనతో ఉన్నారని.. వారి పక్షాన బీజేపీ కొట్లాడుతుందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..

Follow us on