Telangana: శ్రీనివాస్ గౌడ్ భావోద్వేగం.. వేదికపైనే కండతడి పెట్టుకున్న మంత్రి
మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తున్న సమయంలో శ్రీనివాస్ గౌడ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తల్లిదండ్రులు తలుచుకుని మంత్రి కంటతడి పెట్టారు. తల్లిదండ్రులు ఉండి ఉంటే.. అంచెలంచెలుగా ఎదిగిన తనను చూసి సంతోషపడేవారని చెప్పారు. అందరూ మెచ్చేలా పనిచేస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పుకొచ్చారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు..మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ప్రసంగం మధ్యలో వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు..ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన మంత్రి.. కాసేపు కూర్చొని తనను తాను సంభాళించుకున్న తర్వాత తిరిగి తన ప్రసంగాన్ని కొసాగించారు. తన చిన్నతనంలో తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారంటూ.. వారిని తలుచుకుని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కంటతడి పెట్టుకున్నారు.తన తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగిన తాను.. అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తన తల్లిదండ్రులు ఉండి ఉంటే ఎంతో సంతోషపడేవారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..