Watch Video: కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

|

Apr 20, 2024 | 4:33 PM

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బీజేపీ నేత ఈటల రాజేందర్‌ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లపై మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. కేసీఆర్‌ చేసిన తప్పులే రేవంత్‌రెడ్డి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బీజేపీ నేత ఈటల రాజేందర్‌ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లపై మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. కేసీఆర్‌ చేసిన తప్పులే రేవంత్‌రెడ్డి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌లానే ఇతర పార్టీ నాయకులను కొనాలని చూస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌కి పట్టిన గతే రేవంత్‌కి పడుతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఓటేస్తే వృధా అవుతుందన్నారు. రాహుల్‌ గాంధీ జన్మలో ప్రధాని కాలేరని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో 17 సీట్లు గెలిపిస్తేనే హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్‌ చెప్పడం ప్రజలను మరోసారి మోసం చేయడమేనని విమర్శించారు.