‘కాంగ్రెస్-కేసీఆర్ ఒక్కటే, ఇద్దరితో జాగ్రత్త’.. ప్రధాని మోదీ తెలుగులో కీలక వ్యాఖ్యలు

Updated on: Nov 27, 2023 | 5:28 PM

కాంగ్రెస్, కేసీఆర్ ఒక్కటే.. వారిద్దరితో జాగ్రత్త అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని నినదించిన కేసీఆర్ పదేళ్లలో తెలంగాణకు చేసిందేంటి? అని ప్రశ్నించారు. బీజేపీ వస్తే మోదీ గ్యారెంటీ ఎలా ఉంటుందో, అసలు మోదీ గ్యారెంటీ ఏంటో కూడా తెలుగులోనే చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలన వద్దనుకునే వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని సూచించారు.

కాంగ్రెస్, కేసీఆర్ ఒక్కటే.. వారిద్దరితో జాగ్రత్త అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని నినదించిన కేసీఆర్ పదేళ్లలో తెలంగాణకు చేసిందేంటి? అని ప్రశ్నించారు. బీజేపీ వస్తే మోదీ గ్యారెంటీ ఎలా ఉంటుందో, అసలు మోదీ గ్యారెంటీ ఏంటో కూడా తెలుగులోనే చెప్పుకొచ్చారు. తెలంగాణలో కేసీఆర్ పాలన వద్దనుకునే వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడమంటే మళ్లీ కేసీఆర్‌ను గద్దెనెక్కించడమేనని వ్యాఖ్యానించారు. కరీంనగర్ ఎన్నికల సభలో మాట్లాడిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎప్పుడు బీఆర్ఎస్ గూటికి వెళ్తారో తెలీదన్నారు. తెలంగాణలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ తొలి సీఎం బీసీ వర్గానికి చెందినవారే ఉంటారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని.. దీనికి పరిష్కారం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.

 

Published on: Nov 27, 2023 05:25 PM