Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఎన్ని? కోమటిరెడ్డి వెంకటరెడ్డి లెక్క ఇదీ..!

Updated on: Nov 27, 2023 | 5:58 PM

రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్‌ని విశ్వసించడం లేదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతులకు అవసరమైనప్పుడు పట్టించుకోకుండా, ఎన్నికల ముందు రైతుబంధుపై అధికారపార్టీ రాజకీయం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రైతుసంక్షేమానికి కట్టుబడి ఉంటుందన్నారు నల్గొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి.

ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుండడంతో ప్రచారాన్ని ఉధృతం చేశారు కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌, నల్గొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఆయన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అన్ని గ్రామాల్లో ప్రజలు మంగళహారతులు పట్టి కోమటిరెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్‌కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నిరంతరం తెలంగాణ గురించే ఆలోచిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ 80 నుంచి 90 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు కోమటిరెడ్డి.