Telangana Elections: తెలంగాణలో బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందంటే..? సీఎం కేసీఆర్ లెక్క ఇదీ..!

|

Oct 20, 2023 | 5:24 PM

Telangana Polls: తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ సారి గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ గజ్వేల్లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి.. వారికి భరోసానిచ్చారు. వచ్చేది బీఆర్‌ఎస్సే, గెలిచేది మనమే..మరింత అభివృద్ది చేద్దామంటూ కేడర్‌కి పిలుపునిచ్చారు. గజ్వేల్‌లో గెలిచిన పార్టీయే అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తోందని గుర్తుచేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి 95 నుండి 105 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంటలోని కన్వెన్షన్‌ హాల్లో గజ్వేల్‌ బీఆర్ఎస్‌ కార్యకర్తలతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. గజ్వేల్‌కు ఏం కావాలో అన్నీ పనులు చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలు తనను కడుపులో పెట్టుకొని గెలిపించారని, ఈ సారి ఆ పక్కనున్న రెండు మూడు నియోకవర్గాలను గెలిపించాలని పిలుపునిచ్చారు. కామారెడ్డిలో పోటీ చేయడానికి ఓ కారణం ఉందన్నారు. గజ్వేల్‌కు ఇంకా చేయాల్సింది చాలా ఉందన్న సీఎం కేసీఆర్.. గజ్వేల్‌కు ఏం కావాలో తాను అన్నీచేస్తానని హామీ ఇస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత నెలకు ఒక్కపూట గజ్వేల్‌లోనే ఉంటానన్నారు.

సీఎం కేసీఆర్‌ ఈ సారి గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ గజ్వేల్లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి.. వారికి భరోసానిచ్చారు. వచ్చేది బీఆర్‌ఎస్సే, గెలిచేది మనమే..మరింత అభివృద్ది చేద్దామంటూ కేడర్‌కి పిలుపునిచ్చారు. గజ్వేల్‌లో గెలిచిన పార్టీయే అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తోందని గుర్తుచేశారు.

Published on: Oct 20, 2023 05:23 PM