మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానాకు ఊరట..బాంబే హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత:MP Navneet Kaur video.
తన ఎస్సీ సర్టిఫికెట్ వ్యవహారంలో మహారాష్ట్ర..అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానాకి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి ఆమె ఈ ఎస్సీ సర్టిఫికెట్ ను సంపాదించిందని, అందువల్ల దీన్ని రద్దు చేస్తున్నామని బాంబేహైకోర్టులోగడ ఉత్తర్వులు...
తన ఎస్సీ సర్టిఫికెట్ వ్యవహారంలో మహారాష్ట్ర..అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానాకి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి ఆమె ఈ ఎస్సీ సర్టిఫికెట్ ను సంపాదించిందని, అందువల్ల దీన్ని రద్దు చేస్తున్నామని బాంబేహైకోర్టులోగడ ఉత్తర్వులు జారీ చేయగా వాటిని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టుకెక్కింది. బాంబేహైకోర్టు ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సమర్థించి ఉంటే ఈమె తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయి ఉండేది. ఎస్సీలకు రిజర్వ్ చేసిన అమరావతి నియోజకవర్గం నుంచి నవనీత్ కౌర్ రానా ఎన్సీపీ మద్దతుతో పోటీ చేసి గెలిచింది. అయితే ఈమె ఎస్సీ సర్టిఫికెట్ పై ఒకరు బాంబేహైకోర్టుకెక్కారు. ఆ పిల్ పై విచారించిన కోర్టు ఆ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడమే గాక.. రూ. 2 లక్షల జరిమానా కూడా విధించింది. రెండు వారాల్లోగా ఈ జరిమానాను ఆమె మహారాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video : పెళ్లిమండపంలో వరుడికి రీడింగ్ టెస్ట్ పెట్టిన వధువు..పెళ్లిలో నల్ల కళ్లద్దాలు ధరించిన వరుడు.
కోవాగ్జిన్ ఫేజ్ 3 ట్రయల్స్ ..!భారత్ బయో టెక్ నివేదిక ఇదే..పూర్తి వివరాలు ఇవే :Covaxin Phase 3 video.