సర్పంచ్‌ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

Updated on: Dec 06, 2025 | 12:10 PM

తెలంగాణలో కోతుల బెడద గ్రామాలను, పట్టణాలను తీవ్రంగా వేధిస్తోంది. సర్పంచ్ ఎన్నికలలో ఓటర్లు కోతుల సమస్య పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, హనుమకొండ జిల్లా నేరెళ్ల గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్థి చింపాంజీ, ఎలుగుబంటి మాస్కులతో ప్రచారం చేస్తూ కోతులను తరిమేసి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ వినూత్న పద్ధతి ఇతర గ్రామాలకు కూడా విస్తరిస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు పట్టణాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అతిపెద్ద సమస్య కోతుల బెడద. సర్పంచ్ ఎన్నికల ప్రచారం కోసం ఓటర్ల వద్దకు వెళ్తున్న అభ్యర్థులను కోతుల సమస్య ఆందోళనకు చేస్తుంది. కోతుల సమస్య పరిష్కరించిన తర్వాతే ఓట్లు అడగడానికి రండని జనం తెగేసి చెప్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకంగా ఫ్లెక్సీలు కడుతున్నారు.. కోతుల సమస్యకు పరిష్కారం ఎలా చూపాలో అభ్యర్థులకు అంతుచిక్కడం లేదు. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా కోతుల సమస్యకు పరిష్కారం లేక తలలు పట్టుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో కొండముచ్చులను ప్రయోగిస్తున్నారు. మరికొన్ని మున్సిపాలిటీల్లో చింపాంజీ, ఎలుగుబంటి మాస్కులతో వేషాలు ధరించి కోతులను తరిమికొడుతున్నారు. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కూడా ఇదే ఐడియాతో ముందుకెళ్తున్నారు. హనుమకొండ జిల్లా కమలాపురం మండలంలోని నేరెళ్ల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి చేస్తున్న వినూత్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. తన ప్రచారంలో భాగంగా వారి అనుచరులు ఎలుగుబంటి, చింపాంజీ మాస్కులు ధరించి ప్రచారం నిర్వహిస్థూ కోతులను పరుగులు పెట్టిస్తున్నారు. నేరెళ్ల గ్రామంలో 1537 ఓట్లు ఉన్నాయి. సర్పంచ్ పదవి SC రిజర్వ్ కావడంతో 10 మంది బరిలోకి దిగారు. నాగలక్ష్మి ప్రచారం చూసి, శ్రీరామ్ అనే మరో అభ్యర్థి కూడా ఇదే తరహాలో మాస్క్ లు ధరించి కోతులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రచారం మాట ఎలా ఉన్నా కోతులు మాత్రం ఊరి పొలిమేరల వరకు పరుగులు పెడుతున్నాయి. గత నాలుగు రోజులుగా కోతులన్నీ ఊరు విడిచి పొరుగు గ్రామాలకు పరుగులు పెడుతున్నాయి. దీంతో ఇక్కడ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో కోతుల సమస్య పరిష్కరించిన వారే బరిలో నిలవాలని ఊరంతా తీర్మానాలు చేసుకున్న నేపద్యంలో ఈ ఐడియా ఏదో బాగుందని పొరుగు గ్రామాల్లో కూడా వినూత్న రీతిలో ప్రచారాలు నిర్వహిస్తూ జనంచేత ప్రశంసలు పొందుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Putin: పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

Prabhas: ప్రభాస్ నా ఇంటర్‌ ఫ్రెండ్! MLA ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

Indraja: ప్రేమలో మోసపోయారా ?? శాపాలు పెడుతూ ఇంద్రజ ఎమోషనల్!

Bigg Boss Kalyan: చరిత్ర సృష్టించిన ఆర్మీ మ్యాన్! హౌస్‌లో అందరికీ బిగ్ షాక్

సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము