Rahul Gandhi: : మా కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య ఉన్నది ప్రేమానుబంధాల బంధం - రాహుల్ గాంధీ,
Rahul Gandhi Meeting

Rahul Gandhi: : మా కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య ఉన్నది ప్రేమానుబంధాల బంధం” – రాహుల్ గాంధీ,

Updated on: Oct 19, 2023 | 6:54 PM

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఈ రోజు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బీఆర్‌ఎస్‌, బీజేపీపై విమర్శనాస్ర్తాలు ఎక్కుపెడుతున్నారు. బీఆర్‌ఎస్‌ ఒంటరి కాదని.. బీజేపీ, ఎంఐఎం కలిసే ఉంటాయంటూ పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఈ రోజు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బీఆర్‌ఎస్‌, బీజేపీపై విమర్శనాస్ర్తాలు ఎక్కుపెడుతున్నారు. బీఆర్‌ఎస్‌ ఒంటరి కాదని.. బీజేపీ, ఎంఐఎం కలిసే ఉంటాయంటూ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను కాబట్టే తనపై ఎన్నో కేసులు పెట్టారన్నారు రాహుల్‌. తెలంగాణలో కాంగ్రెస్‌ హవా కొనసాగుతుందన్న రాహుల్‌.. కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల పాలన ఏర్పడటం ఖాయమన్నారు. ముందుగా భూపాలపల్లి, మంథనిలో జరిగిన కార్నర్ మీటింగ్ లలో రాహుల్ ప్రసంగించారు. ప్రస్తుతం పెద్దపల్లిలో జరుగుతున్న కాంగ్రెస్ బహిరంగ సభలో మాట్లాడుతున్నారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Oct 19, 2023 04:41 PM