Ponguleti Srinivasa Reddy: పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేస్తా.. నా కంటే రేవంత్ కే ఎక్కువ ఫైర్ ఉంది: పొంగులేటి
Ponguleti Srinivasa Reddy Exclusive Interview: తెలంగాణ రాజకీయాల్లో లేటెస్ట్ సంచలనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వైఎస్ కుటుంబంతో ఉన్న బంధంతో జగన్‌కు దగ్గరైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచే ఖమ్మం ఎంపీగా గెలిచారు. 2014లో మొదటిసారి ఎంపీగా గెలిచి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.
Ponguleti Srinivasa Reddy Exclusive Interview: తెలంగాణ రాజకీయాల్లో లేటెస్ట్ సంచలనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వైఎస్ కుటుంబంతో ఉన్న బంధంతో జగన్‌కు దగ్గరైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచే ఖమ్మం ఎంపీగా గెలిచారు. 2014లో మొదటిసారి ఎంపీగా గెలిచి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అయితే మారిన సమీకరణాల్లో ఆయన BRSలో విలీనం అయ్యారు. 2018లో టికెట్ ఆశించి భంగపడ్డ పొంగులేటి తర్వాత అనుకున్న పదవులు కూడా దక్కకపోవడంతో రెబల్‌గా మారారు. చివరకు BRS పార్టీ సస్పెండ్ చేయడంతో రకరకాల ఆలోచనలు చేసి చివరకు కాంగ్రెస్ గూటికి చేరారు. కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యం అంటున్న పొంగులేటి.. రాజకీయాలను మరీ పర్సనల్‌గా తీసుకున్నారా? కాంట్రాక్టుల ద్వారా అనతి కాలంలోనే వేల కోట్లు సంపాదించి.. అదే డబ్బుతో రాజకీయాలనే శాసించాలనే ఆలోచనతో ఉన్నారా? ఒక్కసారి ఎంపీగా గెలిచిన నాయకుడికి కాంగ్రెస్ ఎందుకంత ప్రాధాన్యత ఇస్తోంది..? రాజకీయాల్లో పొంగులేటి లక్ష్యం ఏంటి? ఇవే అంశాలపై మనతో మాట్లాడేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు.