Watch Video: పూర్తిగా దగ్ధమైన టీడీపీ ఆఫీసు.. కేసు నమోదు.. పోలీసుల దర్యాప్తు..
పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయం కాలి బూడిదైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నాయకుల్లో అసమ్మతి తీవ్ర స్థాయిలో ఉంది. ఇదే క్రమంలో బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్నిగుర్తుతెలియని దుండగులు తగలబెట్టారు. ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది.