Telangana: మా సభలకు జనం పోటెత్తుతున్నారు: రేవంత్
తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రచారానికి గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో పార్టీలు ప్రచారంతో హోరెత్తించాయి. ఈ సందర్భంగా టీవీ9 ప్రత్యేక కాంక్లేవ్‌లో పాల్గొన్న రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. అవెంటో ఈ వీడియోలో చూద్దాం పదండి....
తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రచారానికి గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో పార్టీలు ప్రచారంతో హోరెత్తించాయి. ఈ సందర్భంగా టీవీ9 ప్రత్యేక కాంక్లేవ్‌లో పాల్గొన్న రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. “119 నియోజకవర్గాల్లో 158 మంది కీలకమైన కాంగ్రెస్ నాయకులను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు. ఇంకా వేలాది మంది ద్వితియ, తృతీయ శ్రేణి నాయకులను కూడా తీసుకున్నారు. ఇంత మంది పోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలి అంటే ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. అయినా కానీ మేం పెట్టిన ప్రతి సభకు, ప్రతి కార్యక్రమానికి.. జనం పోటెత్తుతున్నారు. అప్పట్లో ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ కోసం గంటల కొద్ది నిరీక్షించినట్లు విన్నాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు ఏం చెబుతారో అని ప్రజలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఎంత సమయం అయినా ఎదురు చూస్తున్నారు” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
