News Watch: తెలుగు రాష్ట్రాల్లో దండిగా వానలు.. లేటెస్ట్ అప్‌డేట్స్ తెలుసుకుందాం పదండి
News Watch

News Watch: తెలుగు రాష్ట్రాల్లో దండిగా వానలు.. లేటెస్ట్ అప్‌డేట్స్ తెలుసుకుందాం పదండి

Edited By:

Updated on: Jul 24, 2023 | 3:29 PM

తెలుగు రాష్ట్రాల్లోని లేటెస్ట్ న్యూస్.. పొలిటికల్ అప్ డేట్స్.. వాతావరణ విశేషాలు.. ఈ వీడియోలో చూసేద్దాం పదండి...

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులు వరద నీటితో నిండిపోతున్నాయి. మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక ఏపీలోని వార్తల విషయానికి వస్తే నేడు…  అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో ముఖ్యమంత్రి జగన్  ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.  కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి నిర్మాణానికి అధికారుల నుంచి అనుమతి లభించింది. ఇటు తెలంగాణలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా.. నాయకులు, కార్యకర్తలు విషెస్ చెబుతున్నారు. తెలంగాణలో నేటి నుంచి వీఆర్‌ఏ వ్యవస్థ పూర్తిగా రద్దు అవ్వనుంది.

Published on: Jul 24, 2023 08:34 AM