News Watch LIVE: రూ.400 కోట్ల డీల్‌..అసలు కథ ఇదే..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

Updated on: Oct 27, 2022 | 8:11 AM

News Watch: రూ.400 కోట్ల డీల్‌..అసలు కథ ఇదే..! మరియు మరిన్ని తాజా సమాచారలు ,వివరాలు , తెలుగు రాష్ట్రాల ముఖ్య హెడ్ లైన్స్ పై స్పెషల్ ఫోకస్ తో న్యూస్ వాచ్ టీవీ9 స్పెషల్ వీడియో మీ కోసం..

తెలంగాణలో మునుగోడులో బై పోల్ ఇష్యూలో పెను సంచలనం కలిగింది. ఎలక్షన్స్‌కి ముందు చేపట్టిన బిగ్ ఆపరేషన్ ఆకర్ష్.. పోలీసుల ఎంట్రీతో బ్లాస్ట్ అయ్యింది.ఒకటి కాదు రెండు కాదు ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు ఆఫర్ చేయగా సడెన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు వారికి బిగ్ షాక్ ఇచ్చారు. మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో పొలిటికల్ బేరసారాలు జరిపిన రామచంద్రభారతి, నందూ, సింహయాజులను అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్‌ నేతలు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్హాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఉన్నారు.అయితే ముందు నుంచే బీజేపీ కొనుగోళ్లు జరుపుతోందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దాన్ని నిజం అని చెప్పేలా టీఆర్ఎస్ నేతలు ఓ డ్రామా క్రియేట్ చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా గులాబీ పార్టీదే అని ప్రతివిమర్శలు చేస్తున్నారు. పోలీసులు కూడా బేరసారాలు జరుగుతున్నాయన్న సమాచారం తమకు వచ్చిందని, దీంతో తాము దాడులు చేశామంటున్నారు పోలీసులు. అసలు ఏం జరిగిందనేది తేల్చాల్సింది మాత్రం పోలీసులే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 27, 2022 08:10 AM