News Watch Live: నేటి నుంచి ‘జగనన్నకు చెబుదాం’ టోల్ ఫ్రీ నెంబర్ 1902..! వీక్షించండి న్యూస్ వాచ్..
జగనన్నకు చెబుదాం’ అనే కొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు దీనిని చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
‘జగనన్నకు చెబుదాం’ అనే కొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు దీనిని చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబరు 1902ను ఏర్పాటు చేసింది. ఆ నంబరుకు ఫోను చేసి సమస్యలు తెలియజేస్తే వాటిని నమోదు చేసుకొని పరిష్కరిస్తారు. వాటి పరిష్కార క్రమాన్ని ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారుడికి తెలియజేస్తారు.సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగతంగా ఎవరికైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు వైసీపీ సర్కార్ పేర్కొంది. సంక్షేమ పథకాలు, వైఎస్సార్ పెన్షన్ కానుక లేదా రేషన్ కార్డు పొందడం వంటి విషయాల్లో ఏవైన ఇబ్బందులు ఎదురైనా లేదా ప్రభుత్వ పథకాలు అందుకోవడంతో ఏవైన సమస్యలు ఉన్న టోల్‌ఫ్రీ నంబరు 1902కు ఫోను చేయవచ్చు. అంతేకాదు రెవెన్యూ సమస్యలు లేదా ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమస్యలను కూడా తెలియజేయవచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!