News Watch: ఆ ఇద్దరి కలయిక దేనికి సంకేతం ?? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Updated on: Jan 21, 2023 | 7:46 AM

ఏడాది తర్వాత గాంధీభవన్‌లో అడుగుపెట్టిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశయ్యారు. పలు అంశాలపై ఇద్దరు చర్చించినట్లుగా తెలుస్తోంది.

News Watch: ఏడాది తర్వాత గాంధీభవన్‌లో అడుగుపెట్టిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశయ్యారు. పలు అంశాలపై ఇద్దరు చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే సమావేశం తర్వాత బయటకొచ్చిన కోమిటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నాని వెల్లడించారు. సమావేశానికి రావాలని మాణిక్‌రావు ఠాక్రే రమ్మన్నారు.. అందుకే వచ్చానని తెలిపారు. గాంధీభవన్ మెట్లు ఎక్కనని తాను అనలేదని అన్నారు. తనలాంటి సీనియర్లు పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించానని అన్నారు. జనవరి 26 నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాను. అధికారంలోకి ఎలా రావాలి? అనే అంశంపై చర్చిస్తాము. అవసరమైతే తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర చేస్తాను అని అన్నారు. అనంతరం.. గాంధీభవనల్‌ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. దీంతో, వారి మధ్య చర్చపై ఆసక్తి నెలకొంది.

Published on: Jan 21, 2023 07:46 AM