Raj Gopal Reddy: వారి కోసం ఏ త్యాగానికైనా సిద్ధం.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మంత్రి పదవుల్లో ఆయన పేరు లేకపోవడంపై కోమటి రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే ప్రభుత్వానికి సైతం వ్యతిరేకంగా పోరాటం చేస్తానని అన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మంత్రి పదవుల్లో ఆయన పేరు లేకపోవడంపై కోమటి రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే ప్రభుత్వానికి సైతం వ్యతిరేకంగా పోరాటం చేస్తానని అన్నారు. తనది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ.. తామే అధికారంలో ఉన్నప్పటికీ.. నియోజకవర్గానికి, ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. గతంలో తమ నియోజకవర్గానికి అన్యాయం జరిగితే ప్రభుత్వం మొత్తం అక్కడికి వచ్చేలా చేశానని ఆయన గుర్తుచేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం మాటిచ్చిందని.. ఆ పదవి ఇంకొంచెం ఆలసమ్యమైనా భరిస్తానని ఆయన అన్నారు. కానీ మునుగోడు ప్రజలకు ఎవైనా అన్యాయం జరిగితే మాత్రం తన పదవికి రాజీనామా చేయడానికైనా తాను సిద్దంగా ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
