దేశంలో తొలిసారిగా మధ్యప్రదేశ్ లో గ్రీన్ ఫంగస్ కలకలం..మరింత డేంజర్ గా ఫంగస్ వీడియో..:Green fungus video.
కరోనా నుంచి కోలుకున్నవారిని ఫంగస్ టెన్షన్ వెంటాడుతున్న విషయం తెలిసిందే. బ్లాక్, వైట్, ఎల్లో, క్రీమ్ ఫంగస్ కేసులు ఇప్పటివరకు వెలుగుచూశాయి. కొత్తగా మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఓ వ్యక్తి గ్రీన్ ఫంగస్ బారిన పడ్డట్లు అధికారులు గుర్తించారు.
కరోనా నుంచి కోలుకున్నవారిని ఫంగస్ టెన్షన్ వెంటాడుతున్న విషయం తెలిసిందే. బ్లాక్, వైట్, ఎల్లో, క్రీమ్ ఫంగస్ కేసులు ఇప్పటివరకు వెలుగుచూశాయి. కొత్తగా మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఓ వ్యక్తి గ్రీన్ ఫంగస్ బారిన పడ్డట్లు అధికారులు గుర్తించారు. అయితే.. ఈ వైరస్ ప్రభావం రోగులపై ఎంతగా ఉందనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న 34 ఏళ్ల వ్యక్తికి గ్రీన్ ఫంగస్ సోకినట్లు నిర్ధరించారు శ్రీ అరబిందో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్లు. రోగిని ముంబై ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తొలుత బ్లాక్ ఫంగస్ సోకిందని టెస్టులు చేయగా రోగికి గ్రీన్ ఫంగస్ సోకినట్లు తేలిందని డాక్టర్. రవి దోసి వివరించారు. అయితే.. ఈ ఫంగస్‌పై మరింత అధ్యయనం చేయడం అవసరమని ఆయన అన్నారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. రోగిలో అధిక జ్వరం, ముక్కులోంచి రక్తం వంటి లక్షణాలు కనిపించాయని దోసి వివరించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టెలో చిన్నారి.!మహాభారతం నాటి సీన్ మళ్లీ రిపీట్..వైరల్ అవుతున్న వీడియో :viral video.
రూ.12లకే ఇల్లు..త్వరపడండి అంటూ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. కానీ కండిషన్స్ అప్లై:new house at Rs 12 video.